Toothpaste: టూత్‌పేస్టులో ఈ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం ఏమిటి..?

Toothpaste: ప్రతి రోజూ టూత్‌పేస్టుతో పళ్లు తోముకోవడం అనేది జీవితంలో ముఖ్యమైన భాగమనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మార్కెట్లో రకరకాల టూట్‌ పేస్టులు అందుబాటులోకి ..

Toothpaste: టూత్‌పేస్టులో ఈ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం ఏమిటి..?
Toothpaste
Follow us

|

Updated on: Aug 22, 2021 | 2:05 PM

Toothpaste: ప్రతి రోజూ టూత్‌పేస్టుతో పళ్లు తోముకోవడం అనేది జీవితంలో ముఖ్యమైన భాగమనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మార్కెట్లో రకరకాల టూట్‌ పేస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కోల్గేట్‌, మిస్‌వాక్‌, డాబర్‌, తదితర టూత్‌ పేస్టును చాలా మందే వాడుతుంటారు. కానీ ఈ మధ్య కాలం నుంచి ఆయుర్వేదిక్‌ టూత్‌పేస్టులు కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రోజు టూత్‌పేస్టును వాడుతుంటాము తప్ప వాటిలో ఉన్న కొన్ని విషయాలను పెద్దగా గమనించి ఉండము. ఇక టూత్‌పేస్టు ట్యూబ్‌ దిగువన మూడు రంగులు కనిపిస్తుంటాయి. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల గుర్తులు ఉంటాయి. కానీ ఈ రంగులు ఎందుకు ఉంటాయో పెద్దగా తెలుసుకోలేరు. కొందరు ఈ రంగులను వేరే విధంగా భావిస్తుంటారు. ఎలాగంటే ఈ రంగులు నాణ్యతను తెలియజేస్తుందని భావిస్తుంటారు. ఈ రంగుల మార్క్‌ వెనుక కారణం ఉంది. ఈ రంగులు టూత్‌పేస్టు నాణ్యత గురించి వివరిస్తాయి. ఈ టూత్‌పేస్టులపై ఉన్న రంగులను బట్టి వాటి నాణ్యతను తెలుసుకోవచ్చు అని అనుకుంటారు.

ఈ కలర్‌ కోడింగ్‌ అనేది టూత్‌పేస్టు నాణ్యతను మార్క్‌ ద్వారా గుర్తించవచ్చు అని అనుకుంటారు. పేస్టు పూర్తిగా రసాయనంతో తయారు చేయబడి ఉంటుంది. అలాగే రెడ్‌ మార్క్‌ అంటే సహజ, రసాయనాలతో తయారు చేసిన పేస్టు అని, బ్లూ కలర్‌ అంటే సహాజ మరియు ఔషధ, ఆకుపచ్చ అంటే సహాజమైన రసాయనాలతో తయారు చేయబడినట్లుగా భావిస్తుంటారు. కానీ ఇది తప్పు.

ఇందులో నిజమెంత..?

కోల్‌గేట్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ గుర్తుకు నాణ్యతతో ఎలాంటి సంబంధం లేదు. ఈ కలర్‌ కోడింగ్‌ యంత్రాలకు సహాయపడతాయి. ఇంటర్నెట్‌లో వెలువడుతున్న నివేదికల ప్రకారం.. ఈ రంగులు సహాజమైన, రసాయనాలతో తయారైనట్లు భావిస్తారు కానీ… వాస్తవానికి ఈ రంగుల అర్థం ఇది కాదు. టూత్‌ పేస్టు తయారు చేసే ముందు వెనుక భాగంలో సీల్‌ వేసేందుకు గుర్తుగా ఈ రంగులను వాడుతుంటారు. వాస్తవానికి ట్యూట్‌ మేకింగ్‌ మెషీన్‌ లైట్‌ సెన్సార్‌ ఈ గుర్తును గుర్తిస్తుంది. ఈ గుర్తు వల్లే అది టూత్‌పేస్ట్‌ వెనుక భాగంలో సీల్‌ వేసేస్తుంది. కానీ కలర్స్‌ నాణ్యతకు సంబంధించినది కాదు. ఇవే రంగులు కాకుండా వేరే రంగులను కూడా అక్కడ ఉంటాయి. ఈ రంగులను బట్టి యంత్రం ఎంత మడతపెట్టాలి.. అనేదానిని నిర్ధారిస్తుంది. యంత్రంలో పేస్టు కోసం గొట్టాలని తయారు చేసేముందు మెషీన్‌ ఈ రంగులను గుర్తించే వెనుక భాగంలో సీల్‌ వేస్తుంది. ఇందు కోసమే ఈ రంగులను ఉపయోగిస్తుంటారు.

ఇవీ కూడా చదవండి:

Password: హ్యాకర్లు గుర్తుపట్టలేని పాస్‌వర్డ్‌లు కావాలా..? ఇవి పాటించండి.. మీ అకౌంట్‌ సురక్షితం!

Credit Card: రూ.99కే క్రెడిట్ కార్డు.. బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..!