AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA Challenge: నాసా చేపట్టిన ‘బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌’లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

NASA Challenge: చంద్రుడిపై మానవ మనుగడ కోసం నాసా పరిశోధనలు చేపడుతోంది. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా..

NASA Challenge: నాసా చేపట్టిన 'బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌'లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
Subhash Goud
|

Updated on: Aug 22, 2021 | 6:42 PM

Share

NASA Challenge: చంద్రుడిపై మానవ మనుగడ కోసం నాసా పరిశోధనలు చేపడుతోంది. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌’లో ఇద్దరు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో విశాఖకు చెందిన కరణం సాయి ఆశీష్‌కుమార్, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరు అమరేశ్వరప్రసాద్, యూఎస్‌కు చెందిన ప్రణవ్‌ ప్రసాద్‌లు ‘ఏఏ స్టార్‌’ పేరుతో రూపొందించిన ప్రాజెక్టుకు టాప్‌ టెన్‌లో చోటు దక్కింది. దీంతో వీరికి రూ.25 వేల డాలర్లు (రూ.18 లక్షలు) లభించాయి. ఫేజ్‌-2లో నాసాతో కలిసి రెండు సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. చంద్రుడిపై నిర్మాణాలు, నీటి జాడల అన్వేషణ కోసం నాసా గత కొన్నేళ్లుగా పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తోంది.

ఇందులో భాగంగా చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మంచు (ఐస్‌) ఉన్నట్లు గుర్తించింది నాసా. దాన్ని మైనింగ్‌ ద్వారా తవ్వి తీసేందుకు గల అవకాశాలపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సమర్పించాలి ప్రకటించింది. బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌ పేరుతో నిర్వహించిన దీనికి 48 దేశాల నుంచి అనేక యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల నుంచి 374 ప్రాజెక్టులు వచ్చాయి. ఏయూ నుంచి ఎంటెక్‌ పూర్తి చేసిన ఆశీష్‌కుమార్, అమరేశ్వరప్రసాద్‌లతోపాటు యూఎస్‌ నుంచి ప్రణవ్‌ప్రసాద్‌ బృందం రూపొందించిన ప్రాజెక్టు టాప్‌ టెన్‌లో నిలిచి అవార్డు పొందింది. వీరి ప్రాజెక్టులో చోటు దక్కడంతో హర్షం వ్యక్తం అవుతోంది. నాసా నిర్వహించిన ఈ ప్రాజెక్టులో తమ పిల్లలు సత్తాచాటడం ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Toothpaste: టూత్‌పేస్టులో ఈ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం ఏమిటి..?

Password: హ్యాకర్లు గుర్తుపట్టలేని పాస్‌వర్డ్‌లు కావాలా..? ఇవి పాటించండి.. మీ అకౌంట్‌ సురక్షితం!

అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?