Robots: మనిషిలాగే రోబోల ఫీట్లు.. గోడలు దూకుతూ, డ్యాన్స్ చేస్తూ.. వీడియో
రోబోలు వివిధ రకాలుగా తయారవుతూ.. మనకు సేవలందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఈరోబోల వాడకం మరింత పెరిగిపోయింది. ఆస్పత్రుల నుంచి రెస్టారెంట్స్ వరకు రోబోలను వాడుతున్నారు నిర్వాహకులు.
రోబోలు వివిధ రకాలుగా తయారవుతూ.. మనకు సేవలందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఈరోబోల వాడకం మరింత పెరిగిపోయింది. ఆస్పత్రుల నుంచి రెస్టారెంట్స్ వరకు రోబోలను వాడుతున్నారు నిర్వాహకులు. ఇక తాజాగా అలాంటి ఓ రోబోనే నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బోస్టన్ డైనమిక్స్ సంస్థ సృష్టించిన రోబో.. అచ్చం మనిషి మాదిరిగానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగరడం, ఎత్తైన గొడలను దూకుతూ.. ఔరా అనిపిస్తున్నాయి రోబోలు.అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబోలు ఇప్పటికే సింగపూర్ పార్క్‌లు, విధుల్లో చేరి కరోనా సమయంలో భౌతిక దూరం పాటించాలంటూ ప్రజలను చైతన్యం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే సంస్థ.. మరికొన్ని రోబోలకు ప్రాణం పోస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Anchor Suma: చీరలకు కూడా శానిటైజర్ అంటున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్
KCR Raksha Bandhan Celebrations: కేసీఆర్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు..! వీడియో