AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..

ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ కీలక ప్రకనట చేసింది. మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ల ఎన్‌క్రిప్షన్‌ను ఆపేయాల్సి భారతదేశంలో తమ సేవలను నిలిపివేయాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. వాట్సాప్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ ఎన్‌క్రిప్షన్‌ను విచ్చిన్నం చేయాల్సి వస్తే, వాట్సాప్‌ సేవలు దేశంలో నిలిపివేయాల్సి ఉంటుందని..

Whatsapp: అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
Whatsapp
Narender Vaitla
|

Updated on: Apr 26, 2024 | 11:21 AM

Share

ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ కీలక ప్రకనట చేసింది. మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ల ఎన్‌క్రిప్షన్‌ను ఆపేయాల్సి భారతదేశంలో తమ సేవలను నిలిపివేయాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. వాట్సాప్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ ఎన్‌క్రిప్షన్‌ను విచ్చిన్నం చేయాల్సి వస్తే, వాట్సాప్‌ సేవలు దేశంలో నిలిపివేయాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు బెంచ్‌కి తెలిపారు.

సవరించిన సమాచారం సాంకేతిక నిబంధనలకు వ్యతిరేకంగా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించారు. ఐటి నిబంధనలకు సవరణలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ , సంప్రదింపులు లేకుండా నిబంధనలను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఇది వినియోగదారుల గోప్యతకు వ్యతిరేకమని పేర్కొంది. వాట్సాప్‌ను యూజర్లు గోప్యతా ఫీచర్ల కోసం ఉపయోగిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే యూజర్ల గోప్యత కోసం వాట్సాప్‌ ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్ల డేటా ఎవరికీ తెలియకుండా ఉంటుంది. అయితే ఎన్‌క్రిప్షన్‌ను తొలగించాలని అనడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 మరియు 21 ప్రకారం వినియోగదారుల ప్రాథమిక హక్కులను ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని సంస్థ వాదిస్తోంది. ఇలాంటి నిబంధనలు ప్రపంచంలో మరెక్కడా లేవని వాట్సాప్‌ తరపున న్యాయవాది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ నిబంధనలు అమలు చేయకపోతే నకిలీ సందేశాల మూలాన్ని కనుగొనడంలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఇబ్బంది పడతాయని మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటి సందేశం దేశంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగిస్తుందని, పబ్లిక్ ఆర్డర్ సమస్యలను కలిగిస్తుందని పేర్కొంది. మరి ఈ వ్యవహారం ఎటు వైపు మలుపు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..