Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరో రెండు కొత్త ఫీచర్లు..

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌ (Apps)లో వాట్సాప్‌ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ, యూజర్లను చేజారి పోకుండా చూసుకుంటారు కాబట్టే ఈ యాప్‌కు ఇంతటీ క్రేజ్‌ దక్కింది. ఈ క్రమంలోనే ఇతర మెసేజింగ్ యాప్‌ల..

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరో రెండు కొత్త ఫీచర్లు..
Follow us

|

Updated on: May 06, 2022 | 6:42 AM

Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌ (Apps)లో వాట్సాప్‌ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ, యూజర్లను చేజారి పోకుండా చూసుకుంటారు కాబట్టే ఈ యాప్‌కు ఇంతటీ క్రేజ్‌ దక్కింది. ఈ క్రమంలోనే ఇతర మెసేజింగ్ యాప్‌ల నుంచి వచ్చే పోటీని తట్టుకునేందుకు గాను ఇటీవల కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఎమోజీ రియాక్షన్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటి వరకు ఇలాంటి ఫీచర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌కు ఎమోజీలతో తమ రియాక్షన్‌ తెలపొచ్చు. ఇందుకోసం ఇతరుల స్టేటస్‌ అప్‌డేట్‌పై క్లిక్ చేస్తే వెంటనే స్క్రీన్‌పై ఎమోజీ రియాక్షన్స్‌ కనిపిస్తాయి. అందులో నచ్చిన ఎమోజీపై క్లిక్‌ చేసిన వెంటనే అవతలి వ్యక్తికి మీ రియాక్షన్ వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌ను ప్రస్తుతం కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నారు.

ఇదిలా ఉంటే వాట్సాప్‌ దీంతో పాటు మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు షేర్‌ చేసే మెసేజ్‌లను డిలెట్‌ చేసే అవకాశాన్ని గ్రూప్‌ అడ్మిన్‌కు కల్పించనున్నారు. దీంతో ఫేక్‌ న్యూస్‌కు చెక్‌ పెట్టే అవకాశం లభించనుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Egg Viral Video: గుడ్డుపై నుంచి వెళ్లిన భారీ ట్రక్కు..పెంకు కూడా ఊడలే.! ఇంటర్నెట్ షేక్ చేస్తున్న వీడియో..

Big News Big Debate: APలో టెన్త్‌ పేపర్ల లీకులు ప్రభుత్వ వైఫల్యమా..? జనం దృష్టి మళ్లించేందుకు TDP కుట్ర చేస్తోందా..?

DMHO Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో తెలంగాణ-రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

అనంత్ అంబానీ పెళ్లి.. లండన్, అబుదాబిలో కాదు ఇక్కడే జరగనుంది..!
అనంత్ అంబానీ పెళ్లి.. లండన్, అబుదాబిలో కాదు ఇక్కడే జరగనుంది..!
ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు