Inverter: అవసరాలకు అనువైన ఇన్వర్టర్ ఎంచుకోవటంతో పాటు.. ప్రమాదాలు జరగకుండా ఇలా జాగ్రత్త పడండి..

Inverter: ఈ సంవత్సరం వేసవిలో ఎండలు(summer Heat) విపరీతంగా ఉన్నాయి. వీటికి తోడు కరెంటు కష్టాలు(Power Cuts) చేరడంతో ఉపశమనం కోసం ఇన్వర్టర్లు అనివార్యంగా మారుతున్నాయి. దీంతో ఇన్వర్టర్లకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది.

Inverter: అవసరాలకు అనువైన ఇన్వర్టర్ ఎంచుకోవటంతో పాటు.. ప్రమాదాలు జరగకుండా ఇలా జాగ్రత్త పడండి..
Inverter Selection
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 05, 2022 | 6:23 PM

Inverter: ఈ సంవత్సరం వేసవిలో ఎండలు(summer Heat) విపరీతంగా ఉన్నాయి. వీటికి తోడు కరెంటు కష్టాలు(Power Cuts) చేరడంతో ఉపశమనం కోసం ఇన్వర్టర్లు అనివార్యంగా మారుతున్నాయి. దీంతో ఇన్వర్టర్లకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అసలు సరైన ఇన్వర్టర్ ఎలా ఎంచుకోవాలి అని ఆలోచిస్తున్నారా. అయిదే సరైన దానిని ఎలా ఎంచుకోవాలన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాటరీలు తమలోని లోవోల్టేజ్ డైరెక్ట్ కరెంటును ఆల్టర్నేట్ కరెంటుగా మార్చి మన ఇంటిలోని గృహోపకరణాలు పనిచేందుకు వీలుగా మారుస్తాయి. ఇవి పవర్ జనరేటర్లు లాగా ఎక్కువ శబ్ధం చేయవు. అందువల్ల సరైన ఇన్వర్టర్ ఎంచుకునే ముందు మన ఇంట్లో ఎంత కరెంటు వినియోగం ఉందనేది లెక్కించాలి. దీనికి అనుగుణంగా సరైన కెపాసిటీ ఉండే ఇన్వర్టర్ ను వినియోగదారులు ఎంచుకోవచ్చు. మన అవసరాలుకు కనీసం రెండింతల సామర్ధ్యం కలిగిన ఇన్వర్టర్లను కొనుగోలు చేయటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఒక్కోసారి ఇతర పరికరాలను వినియోగించినా లోడ్ ప్రభావం ప్రతికూలంగా మారదని వారు అంటున్నారు.

ఈ రోజుల్లో బ్యాటరీల కొనుగోలు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. బ్యాటరీ సామర్ధ్యాన్ని యాంపియర్ అవర్స్ లో కొలుస్తారు. మీ అవసరాలకు కావలసిన కెపాసిటీని లెక్కించటానికి మీరు అవసరమైన పవర్ వాట్స్ ను గంటలతో గుణించి దానిని బ్యాటరీ వోల్టేజీతో భాగించాలి. దీని ఆదారంగా సరైన కెపాసిటీ కలిగిన ఇన్వర్టర్ ను ఇంట్లో ఇన్ట్సాల్ చేసుకోవచ్చు. బ్యాటరీలను ఎల్లప్పుడూ డ్రై , ఓపెన్ ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఇన్వర్టర్ బ్యాటరీలు ఛార్జ్ అయ్యేటప్పుడు వేడి వస్తుంది. ఆ సమయంలో దానిని చల్లబరచటం బ్యాటరీ ఆరోగ్యానికి, పనితీరుకు చాలా ముఖ్యం. గాలి ఆడని ప్రదేశాల్లో ఇన్వర్టర్ పెట్టినట్లయితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు ఇలాంటి వాటి వల్ల జరిగే ప్రమాదాలతో ఆస్తి, ప్రాణ నష్టం కూడా అధికంగా ఉండవచ్చు.

బ్యాటరీ సరిగా పనిచేయాలంటే దానిని తరచుగా వాడుతుండాలి. పవర్ కట్ లేకపోయినా బ్యాటరీ పవర్ ను రీసైకిల్ చేయాలి. కనీసం నెల రోజులకు ఒక్కసారైనా ఇలా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఛార్జింగ్ ఖాళీ తేసి మళ్లీ బ్యాటరీని ఛార్జ్ చేయటం వల్ల బ్యాటరీ డెడ్ అయ్యే ప్రమాదం ఉండదని వారు చెబుతున్నారు. దీనికి తోడు బ్యాటరీల్లో ఉండే నీటి లెవల్ పరిశీలించాలి. ఒకవేళ నీటిని సరిగా మెయింటెన్ చేయకపోతే బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది. దీనికి తోడు బ్యాటరీని తరచుగా శుభ్రం చేయాలి. ఈ సమయంలో ఇన్వర్టర్ నుంచి బ్యాటరీని డిస్కనెక్ట్ చేయాలి. అలా చేయటం వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉండదు. బ్యాటరీ పనితీరు సరిగా లేకపోతే వెంటనే లోపాలను రిపేర్ చేయిస్తే దాని పనితీరు బాగుంటుంది. బ్యాటరీ పూర్తిగా దెబ్బతింటే వెంటనే మార్చాలి.. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా అవసరాలకు సరిపడే సరైన కెపాసిటీ ఇన్వర్టర్ ISO గుర్తింపు కలిగిన సంస్థ నుంచి కొనుగోలు చేయటం ఉత్తమం. ఇన్వర్టర్ బ్యాటరీల నిర్వహణలో అలసత్వం చూపకూడదని ముందుగా గుర్తుంకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి..

Britannia: పెరుగుతున్న బిస్కెట్ల ధరలు.. ఆ కారణాల వల్ల భారీగా పెంపు ఉంటుందంటున్న బ్రిటానియా కంపెనీ..

Wheat: దేశంలో భారీగా పెరుగుతున్న గోధుమల ధరలు.. కారణం అదే..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!