DMHO Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో తెలంగాణ-రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం (DMHO).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

DMHO Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో తెలంగాణ-రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..
Telangana Jobs 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2022 | 5:57 PM

DMHO Rangareddy District Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం (DMHO).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 13

పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 6
  • సైకాలజిస్టు పోస్టులు: 1
  • డీఈఐసీ మేనేజర్‌ పోస్టులు: 1
  • స్టాఫ్‌ నర్సు పోస్టులు: 1
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 1
  • ఫార్మసిస్టు పోస్టులు: 2
  • సోషల్‌ వర్కర్ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

పే ప్కేల్: నెలకు రూ.21,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, జీఎన్‌ఎం, పీజీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డీఎంహెచ్‌ఓ, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IRCON Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఇర్కాన్‌లో సివిల్‌ ఇంజనీర్ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..