Poco F6: ఆ చిప్ కలిగి ఉన్న ఫస్ట్ ఫోన్ ఇదే.. క్రేజీ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్స్.. సేల్ ఎప్పటి నుంచి అంటే..
పోకో కంపెనీ మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో ఎఫ్ 6 అనే మోడల్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ 90 డబ్ల్యూ టర్బో చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఫోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ మే 23న విడుదల చేశారు. దీని ప్రారంభ రూ.29,999 గా నిర్ణయించారు. ఆఫర్ల పై దాదాపు రూ.నాలుగు వేల తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

దేశ మార్కెట్లోకి రోజూ అనేక మోడళ్ల స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అనేక కొత్త ఫీచర్లు, డిజైన్ తో ఆకట్టుకుంటున్నాయి. వివిధ కంపెనీలు ప్రజలకు అందుబాటు ధరలలో బెస్ట్ ఫోన్లు అందజేస్తున్నాయి. పనితీరు, నాణ్యత, బ్యాటరీ బ్యాకప్ తదితర వాటిలో వేటికవే తీసిపోని విధంగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే పోకో కంపెనీ ఎఫ్ 6 పేరిట కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.
పొకో ఎఫ్ 6 విడుదల..
పోకో కంపెనీ మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో ఎఫ్ 6 అనే మోడల్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ 90 డబ్ల్యూ టర్బో చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఫోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ మే 23న విడుదల చేశారు. దీని ప్రారంభ రూ.29,999 గా నిర్ణయించారు. ఆఫర్ల పై దాదాపు రూ.నాలుగు వేల తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
అనేక ప్రత్యేకతలు..
ఫోకో ఎఫ్ 6 ఫోన్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్‌సెట్ మద్దతు ఉంది. స్పష్టమైన డిస్‌ప్లే, వేగవంతమైన పనితీరు, మంచి కెమెరా, ఎక్కువ బ్యాకప్ కలిగిన బ్యాటరీతో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
ధర, ఇతర వివరాలు..
పోకో ఎఫ్ 6 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 ఎంబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో కూడిన స్టాండర్డ్ వేరియంట్ రూ.29,999, అలాగే 12 ఎంబీ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కూడిన వెర్షన్ రూ. 31,999, ఇంకా 12 ఎంబీ 512 జీబీ కలిగిన మరో వేరియంట్ రూ.33,999 ధరలలో అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు వేరియంట్లు వేటికమే ప్రత్యేకమైనవి.
29న సేల్ ప్రారంభం..
మే నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సేల్ ఆన్ లైన్ లో ప్రారంభమవుతుంది. మొదటి రోజు ప్రత్యేక ఆఫర్లో దాదాపు 4 వేల రూపాయల తగ్గింపు ధరలో వీటిని కొనుగోలు చేయవచ్చు. అంటే పోకో ఎఫ్ 8 ఎంబీ+256 జీబీ వెర్షన్ రూ.25,999, 12 ఎంబీ+256 జీబీ వెర్షన్ రూ.27,999, 12 ఎంబీ+ 512 జీబీ వెర్షన్ రూ.29,999కి పొందవచ్చు. అలాగే రూ. 2 వేలు బ్యాంక్ ఆఫర్, మరో రూ. 2 వేలు ప్రొడక్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. సేల్ ప్రారంభమైన మొదటి రోజు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక వారంటీ ఉంటుంది.
మరింత తగ్గింపు..
ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు, ఈఎమ్ ఐ విధానంలో తీసుకునేవారు రూ. 2 వేల తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. క్లాసిక్ బ్లాక్, టైటానియం గ్లో అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
ఆకట్టుకునే డిజైన్..
పోకో ఎఫ్ 6 5జీ స్మార్ట్ ఫోన్ మంచి డిజైన్ తో చూడగానే ఆకట్టుకుంటుంది. ఫీచర్లు కూాడా అద్భుతంగా ఉన్నాయి. దీనిలో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. వీడియో కోసం f/1.59 ఎపర్చరు, హెచ్ డీఆర్10 + ఫీచర్‌తో డ్యూయల్ సోనీ కెమెరాను అమర్చారు. 90 డబ్ల్యూ టర్బో చార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ ఎక్కువ సేపు పనిచేస్తుంది. బూస్ట్ ఛార్జింగ్ స్పీడ్ ఫీచర్ తో పాటు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, 6.67 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.
కాంతివంతమైన డిస్ ప్లే..
పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ లో క్రిస్టల్ రెస్ ఫ్లో అమోలెడ్ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఇది 2400 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ తో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుంది. దేశంలో కొత్త క్వాల్కమ్ చిప్‌ని ప్యాక్ చేసిన మొదటి ఫోన్ కూడా ఇదే. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షియోమి హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..