Lava Yuva 5G: రూ. 10 వేలలోనే 5జీ స్మార్ట్ ఫోన్.. డిజైన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
లావా యువ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే దిశగా లావా కీలక అడుగు వేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన చిన్న టీజర్‌ను సైతం కంపెనీ విడుదల చేసింది. బ్రేస్ యూవర్ సెల్ఫ్, లావా 5జీ కమింగ్ సూన్ అంటూ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను కంపెనీ షేర్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఫోన్ డిజైన్ చాలా బాగా ఉండేలా కనిపిస్తోంది...

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా, దేశంలోని అన్ని నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ని విస్తరించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వరుసగా 5జీ ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.
లావా యువ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే దిశగా లావా కీలక అడుగు వేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన చిన్న టీజర్‌ను సైతం కంపెనీ విడుదల చేసింది. బ్రేస్ యూవర్ సెల్ఫ్, లావా 5జీ కమింగ్ సూన్ అంటూ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను కంపెనీ షేర్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఫోన్ డిజైన్ చాలా బాగా ఉండేలా కనిపిస్తోంది.
ఇక ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో డ్యుయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. సర్క్యూలర్ మోడల్‌లో కెమెరాను డిజైన్ చేశారు. ఇక కెమెరా పనితీరు విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ఈ కెమెరా ఉండనుంది.
Brace yourself, Gen-Z!#Yuva5G – Coming soon#LavaMobiles #ProudlyIndian pic.twitter.com/KL8yGkpY6d
— Lava Mobiles (@LavaMobile) May 25, 2024
అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుందని సమాచారం.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో కెమెరాకు ప్రత్యేకంగా ఏఐ టెక్నాలజీని అందించనున్నారని సమాచారం. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ. 10 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..