Oneplus Open 2: వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర అక్షరాల రూ. లక్షన్నర..

టెక్‌ మార్కెట్లో బడ్జెట్‌ ఫోన్‌లకు ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో.. ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లకు సైతం అదే స్థాయిలో డిమాండ్‌ ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలన్నీ మడతపెట్టే ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: May 26, 2024 | 9:54 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ మార్కెట్లోకి కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్‌ ఓపెన్‌ 2 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. నిజానికి గతేడాది లాంచ్‌ చేసిన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా కొత్త వన్‌ప్లస్ ఓపెన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కొత్త లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది.

1 / 5
ఇదిలా ఉంటే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ నెట్టింట మాత్రం కొన్ని ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ శాటీలైట్‌ టెక్నాలజీతో వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ను ఓప్పో ఫైండ్‌ ఎన్‌5కి రీబ్రాండెడ్‌ వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

3 / 5
ఈ ఫోన్‌లో 5 కెమెరాలతో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. వీలో 64 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సర్‌, 48 ఎంపీ మెయిన్‌ సెన్సర్‌, 48 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌లతో పాటు అన్‌ఫోల్డ్‌ డిస్‌ప్లేపై మరో 32 ఎంపీ కెమెరాను ఇవ్వనున్నారని సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 20 ఎంపీ కెమెరా ఇవ్వనున్నారు.

4 / 5
ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,40,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us