- Telugu News Photo Gallery Technology photos Google pay introduces 2 new features buy now and pay later, credit card offer details
Google Pay: మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా.? అయితే మీకో గుడ్ న్యూస్..
దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగిన నేపథ్యంలో గూగుల్ పే సేవలు రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. ఈ సేవలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో గూగుల్ పేలో రకరకాల కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్ పేలో రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేశారు. ఇంతకీ ఏంటా ఫీచర్లు.? వాటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 26, 2024 | 10:37 AM

గూగుల్ పే యూజర్లకు ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా రెండు ఆప్షన్స్‌ను తీసుకొచ్చింది. ఎక్కువగా షాపింగ్ చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ ఫీచర్లు.? వాటితో ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందిస్తుంటాయి. క్రెడిట్ కార్డులతో పాటు డెబిట్ కార్డులపై కూడా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అయితే ప్రతీసారి సదరు ఆఫర్ల అన్నింటి గురించి మనకు తెలియాలని ఉండదు. అలాంటి వారి కోసమే గూగుల్ పే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగించే వారికి క్యాష్ బ్యాక్, రీడీమ్ పాయింట్స్‌ను రీడీమ్ చేసుకునే వారికి ఉపయోగపడేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో మీరు ఏదైనా కార్డుతో షాపింగ్ చేసే సమయంలో ప్రతీ కార్డుతో ఉన్న ప్రయోజనాలను ఒకచోట చూపిస్తుంది.

ఇక గూగుల్‌పే తీసుకొచ్చిన మరో ఫీచర్ బై నౌ పే లేటర్ ఆప్షన్. చాలా ప్లాట్‌ఫారమ్‌లు ఇలాంటి సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గూగుల్ పే సైతం ఈ సేవలను తీసుకొచ్చింది.

ఈ ఆప్షన్‌తో ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన వెంటనే మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ మొత్తాన్ని వాయిదాల ఈఎమ్‌ఐ విధానంలో చెల్లించవచ్చు.




