AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phones Under 15K: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో మతిపోగొడుతున్న స్మార్ట్‌ ఫోన్స్‌.. వీటికి ఏవీ సాటిరావంతే..!

ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్‌ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ ప్రొడెక్ట్స్‌పై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తూ సేల్స్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి సంస్థలు ప్రత్యేక సేల్స్‌ నిర్వహించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ధరలను అందించాయి. అయితే రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు మళ్లీ సేల్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సేల్స్‌ రూ.15 వేల లోపు అదిరిపోయే ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న ఫోన్స్‌ గురించి తెలుసుకుందాం.

Phones Under 15K: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో మతిపోగొడుతున్న స్మార్ట్‌ ఫోన్స్‌.. వీటికి ఏవీ సాటిరావంతే..!
Smartphone
Nikhil
| Edited By: |

Updated on: Dec 06, 2023 | 9:30 PM

Share

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతున్నారు. భారతదేశంలో మధ్యతరగతి జనాభా ఎక్కువ. కాబట్టి ఇలాంటి దేశంలో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా తక్కువ ధరలోనే అధిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్స్‌ను ఆయా కంపెనీలు రిలీజ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్‌తో పాటు సూపర్‌ ఫీచర్స్‌తో తక్కువ ధరకే ఫోన్లను రిలీజ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్‌ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ ప్రొడెక్ట్స్‌పై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తూ సేల్స్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి సంస్థలు ప్రత్యేక సేల్స్‌ నిర్వహించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ధరలను అందించాయి. అయితే రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు మళ్లీ సేల్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సేల్స్‌ రూ.15 వేల లోపు అదిరిపోయే ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న ఫోన్స్‌ గురించి తెలుసుకుందాం.

టెక్నో పోవా 5 ప్రో

టెక్నోపోవా 5 ప్రో 5జీ ఫోన్‌ పవర్డ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ ద్వారా పని చేస్తుంది. 68 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్‌ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మైక్రో ఎస్‌డీ ద్వారా స్టోరేజీని విస్తరించుకునే ఆప్షన్‌తో 128జీబీ, 256 జీబీ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. లాగే 50 ఎంపీ డ్యువల్‌ కెమెరా సెటప్‌తో పాటు 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఈ ఫోన్‌ ముఖ్యంగా గేమింగ్ లేదా సినిమాలను చూడడానికి అనువుగా ఉంటుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం14 

తక్కువ ధరలోనే అత్యధిక పనితీరు ఉండే ఫోన్‌ గురించి ఎదురుచూస్తున్న వారికి సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 14 ఫోన్‌ ఓ మంచి ఎంపిక. 90 హెచ్‌జెడ్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వచ్చే ఈ ఫోన్‌ వీడియోలను చూడటానికి లేదా గేమ్‌లు ఆడేందుకు అనువుగా ఉంటుంది. ఎక్సినోస్‌ 1330 చిప్ సెట్‌తో పని చేసే ఈ ఫోన్‌ రోజువారీ పనులతో పాటు తేలికపాటి మల్టీ టాస్కింగ్‌లను పరిష్కరిస్తుంది. 6,000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అత్యుత్తమ కెమెరా పనితీరుతో పాటు బోట్‌లోడ్ ఫీచర్లు ఈ ఫోన్‌ ప్రత్యేకతలు

ఇవి కూడా చదవండి

లావా బ్లేజ్ ప్రో 

లావా బ్లేజ్ ప్రో 5జీ స్టైలిష్‌ డిజైన్‌తో వస్తుంది. 120హెచ్‌జెడ్‌ ఎల్‌సీడీ స్క్రీన్ సూపర్‌ఫాస్ట్, శక్తివంతమైన డైమెన్సిటీ 6020 చిప్ సెట్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. ముఖ్యంగా 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యకత. ముఖ్యంగా ఈ ఫోన్‌తో లోలైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు.

రెడ్‌మీ 12 5జీ 

రెడ్‌మీ 12 5జీ ఫోన్‌ కూడా రూ.15 వేల లోపు మంచి ఫోన్‌ కోసం ఎదురుచూసే వారికి మంచి ఎంపిక. ముఖ్యంగా ఈ ఫోన్‌ డిజైన్‌పరంగా వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తుంది. 128 జీబీ, 256 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌ మెమరీ సమస్యలను తీరుస్తుంది. ఈ బడ్జెట్‌ ఫోన్స్‌ సెగ్మెంట్‌ అగ్రగామిగా నిలుస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..