- Telugu News Photo Gallery Technology photos These are the smartphones at budget prices.. Shock if you know the features
Smartphones Under 15K: బడ్జెట్ ధరల్లో అదిరే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్లు తెలిస్తే షాక్..!
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. గతంలో కేవలం ఫోన్లు, మెసేజ్‌లకు మాత్రమే ఫోన్లు వాడే పరిస్థితి నుంచి ప్రతి చిన్న అవసరానికి ఫోన్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎక్కువ మధ్యతరగతి ప్రజలు ఉంటారు. కాబట్టి వారికి అందుబాటులో రూ.15 వేల లోపు సూపర్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ధర తక్కువైనా ఫీచర్ల విషయంలో మాత్రం ప్రీమియం ఫోన్లకు తగ్గకుండా గట్టి పోటీనిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 15 వేల లోపు ధరలో అందబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై ఓ లుక్కేద్దాం.
Srinu | Edited By: Ram Naramaneni
Updated on: Nov 17, 2023 | 9:57 PM

ఐక్యూ జెడ్ 6 ప్రస్తుతం రూ.14,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభంలో రూ. 20,000 ఉన్నా క్రమేపీ రూ.15 వేలకు చేరుకుంది. 6.58-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్లో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. అలాగే ఈ ఫోన్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది.

మోటో జీ 54 5 జీ ఫోన రూ. 13,999 నుంచి అందుబాటులో ఉంటుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేస్తుంది. ముఖ్యంగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆకర్షణీయంగా ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7020 చిప్‌తో పనిచేస్తుంది. 8 జీబీ + 128 జీబీ, 12 జీబీ + 256 జీబీ వేరియంట్స్‌లో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

రెడ్ మీ 12 5జీ ఫోన్ రూ. 11,999కు కొనుగోలు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ చవకైన ధరలో మంచి 5జీ ఫోన్‌గా నిలుస్తుంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌తో పని చేసే ఈ ఫోన్ 8 జీబీ + 256 జీబీ వేరింయంట్‌లో కూడా లభ్యమవుతుంది. 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

పోకో ఎక్స్ 5 5 జీ ఫోన్ రూ. 13,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. అలాగే కంటెంట్ వీక్షణ, స్ట్రీమింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే 5జీ వినియోగదారులకు ఈ ఫోన్ మంచి ఎంపిక.

రెడ్ మీ నోట్ 12 ఫోన్ కూడా రూ. 15,499కు అందుబాటులో ఉంది. ఆఫర్ల సమయంలో మాత్రం రూ. 15,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.





























