- Telugu News Photo Gallery Technology photos Oneplus launching new smartphone Oneplus ace 3 features and price details
OnePlus Ace 3: వన్‌ప్లస్ నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్స్‌ను తీసుకొచ్చిన వన్‌ప్లస్ తాజాగా మరోసారి ప్రీమియం ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇటీవల వన్‌ప్లస్ ఏస్2తో మార్కెట్లో సందడి చేసిన వన్‌ప్లస్.. ఇప్పుడు వన్‌ప్లస్ ఏస్3 ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 17, 2023 | 10:15 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ ఏస్3 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. మెటల్ ఫ్రేమ్ డిజైన్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే ఇంటర్నెట్‌లో లీక్ అయిన సమాచారం మేరకు ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం వన్‌ప్లస్ ఏస్3 ఫోన్‌లో 1.5కే రిజల్యూషన్‌తో కూడిన కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ చేయనుంది. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనన్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ కెమెరాలను ఇవ్వనున్నారు. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనే ఫీచర్‌ను కెమెరాలో ప్రత్యేకంగా అందించారు. ఇక ఈ ఫోన్‌లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో డిన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఐపీ68 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్ అందించారు.





























