- Telugu News Photo Gallery Technology photos Samsung soon launching new earbuds Galaxy buds 3 pro features and price details
Galaxy Buds 3 Pro: సామ్‌సంగ్ నుంచి సూపర్ ఇయర్ బడ్స్.. ఫీచర్స్ అద్భుతం..
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేయనుంది. ప్రీమియం సెగ్‌మెంట్‌లో ఈ ఇయర్ బడ్స్‌ను తీసుకురానున్నారు. గ్యాలక్సీ బడ్స్ 3 ప్రో పేరుతో ఈ ఇయర్ బడ్స్‌ను తీసుకురానున్నారు. వచ్చే ఏడాది జనవరిలో వీటిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 28, 2023 | 6:36 PM

సామ్‌సంగ్ గడిచిన జులై నెలలో గ్యాలక్సీ బడ్స్ 2 ప్రో బడ్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వీటి ధర రూ. 17,999గా ఉంది. అయితే ఇప్పుడు ఇదే ఇయర్ బడ్స్‌కి కొనసాగింపుగా గ్యాలక్సీ బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది సామ్‌సంగ్.

సామ్‌సంగ్ త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్న గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ ఫోన్‌తో పాటు ఈ కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో గ్యాలక్సీ బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తోంది.

ఇక ఈ ఇయర్ డ్స్‌ఫీచర్ల విషయానికొస్తే వీటిని.. ట్రూ వైర్‌లెస్ టెక్నాలజీతో రూపొందించారు. అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో ఈ ఇయర్ డ్స్‌ను లాంచ్ చేయనున్నారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో కూడిన ఇయర్ బడ్స్ కాల్స్ మాట్లాడుకోవడానికి మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఈ ఇయర్ బడ్స్‌లో వైర్‌లెస్ ఆడియో హెడ్‌సెట్ టూ వే స్పీకర్‌లు కూడా అందించనున్నారు. గ్యాలక్సీ బడ్స్ 3 ప్రోలో 24 బిట్ హై ఫై ఆడియో సపోర్ట్‌ను అందించనున్నారు.

ధర విషయానికి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. అయితే లీక్ అయిన సమాచారం ఆధారంగా ఈ ఇయర్ డ్స్ ధర రూ. 20వేల వరకు ఉండొచ్చని అంచనా. త్వరలో ఇయర్ బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను సామ్‌సంగ్ ప్రకటించనుంది.





























