Best Phones Under 15K: తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే.. టాప్ బ్రాండ్లు.. టాప్ లేపే ఫీచర్లు..
వాస్తవానికి మార్కెట్లో పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని టాప్ బ్రాండ్లకు చెందిన ఫోన్లు కనిపిస్తాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్? మన అవసరాలకు ఏది ఉపయోగపడుతుంది? అని ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన పనే. అందుకే మీకు ఆ శ్రమ లేకుండా మేమే తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను మీ కోసం లిస్ట్ చేశాం. వాటిపై ఓ లుక్కేయండి..

మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? మీ జేబుకు చిల్లు పడకుండా మంచి ఫీచర్ల, పనితీరు కలిగిన ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. వాస్తవానికి మార్కెట్లో పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని టాప్ బ్రాండ్లకు చెందిన ఫోన్లు కనిపిస్తాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్? మన అవసరాలకు ఏది ఉపయోగపడుతుంది? అని ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన పనే. అందుకే మీకు ఆ శ్రమ లేకుండా మేమే తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను మీ కోసం లిస్ట్ చేశారు. రూ. 15,000 ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్ మీ 12 5జీ..
ఈ ఫోన్ ఇటీవల లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 10,999 నుంచి ప్రారంభమవుతుంది. మన దేశంలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ ఇదే. కాల్‌లు, టెక్స్ట్‌లు, సోషల్ మీడియా బ్రౌజింగ్, గేమింగ్ వంటి రోజువారీ పనులను నిర్వహించడానికి ఇది అనుకూలమైన ఎంపిక. ఎంట్రీ-లెవల్ బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ వెనుకవైపు ఆకర్షణీయమైన గాజు ప్యానెల్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. రూ. 15,000లోపు బడ్జెట్లో 5జీ ఫోన్ కావాలనుకొనే వారికి ఇది మొదటి చాయిస్.




శామ్సంగ్ గెలాక్సీ ఎం14 5జీ..

అనువైన బడ్జెట్లో మంచి పనితీరు అందించే ఫోన్లలో ఇది ఒకటి. దీనిలో 90హెర్జ్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంటుంది. సమర్థవంతమైన ఎక్సినోస్ 1330 చిప్‌తో వస్తుంది. ఇది రోజువారీ పనులకు, సాధారణ గేమింగ్స్ కు సరిపోతుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. రూ. 15,000 కంటే తక్కువ ధరలో లభించే 5జీ ఫోన్లలో బెస్ట్ ఆప్షన్ ఇది.
రియల్ మీ నార్జో ఎన్53..

ఇది మంచి పనితీరును అందించడమే కాకుండా.. డిజైన్ లో ఐ ఫోన్14 ను గుర్తుకు తెస్తుంది. రోజువారీ పనులకు, సాధారణ గేమింగ్ లకు బాగా ఉపకరిస్తుంది. ర్యామ్ 6జీబీ ఉంటుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్ కు ఉపయుక్తంగా ఉంటుంది. ఫోన్ లైట్ వెయిట్ లో ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఇది రూ. 15,000 లోపు ధరలో బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.
ఐక్యూఓఓ జెడ్6 లైట్ 5జీ..

తక్కువ ధరలో లభించే అత్యుత్తమ 5జీ ఫోన్లలో ఇది కూడా ఒకటి. దీనిలో శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. అలాగే 120 హెర్జ్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. బ్యాటరీ 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. కెమెరా విషయానికి వస్తే 50ఎంపీ డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ ఆకట్టుకునే ఫోటోలు, వీడియోలను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..