Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lava Yuva2: రూ. 7వేల లోపు ధరలోనే 6జీబీ ర్యామ్.. లావా నుంచి కొత్త స్టైలిష్ స్మార్ట్ ఫోన్ .. పూర్తి వివరాలు ఇవి..

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందించే దేశీయ బ్రాండ్ లావా మరో కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. లావా యువ 2 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న లావా యువ, లావా యువ ప్రో మోడళ్ల తర్వాత మూడో వేరియంట్ గా లావా యువ 2 ను ఆవిష్కరించింది. దీంతో 90హెర్జ్ ల రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్ డీప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. యూనిసోక్ టీ606 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

Lava Yuva2: రూ. 7వేల లోపు ధరలోనే 6జీబీ ర్యామ్.. లావా నుంచి కొత్త స్టైలిష్ స్మార్ట్ ఫోన్ .. పూర్తి వివరాలు ఇవి..
Lava Yuva 2
Follow us
Madhu

|

Updated on: Aug 03, 2023 | 12:47 PM

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందించే దేశీయ బ్రాండ్ లావా మరో కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. లావా యువ 2 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న లావా యువ, లావా యువ ప్రో మోడళ్ల తర్వాత మూడో వేరియంట్ గా లావా యువ 2 ను ఆవిష్కరించింది. దీంతో 90హెర్జ్ ల రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్ డీప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. యూనిసోక్ టీ606 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 3 ర్యామ్ తో పాటు అదనంగా మరో 3 జీబీ వర్చువల్ ర్యామ్ కలిపి మొత్తం 6జీ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 12 నుంచి శక్తి పొందుతుంది. దీనికి బ్లోట్ వేర్ లేదని కంపెనీ ప్రకటించింది. ఒక ఆండ్రాయిడ్ 13 కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఇతర భద్రతా ఫీచర్లు రెండేళ్ల వరకూ అప్ డేట్లు వస్తాయి. ఈ ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో పాటు వీజీఏ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. యూఎస్బీ టైప్-సి ద్వారా 10 వాట్ల ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది.

లావా యువ2 పూర్తి స్పెసిఫికేషన్లు ఇవి..

డిస్ ప్లే.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.5-అంగుళాల (1600 × 720 పిక్సెల్‌లు) హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఆక్టా-కోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది.

ర్యామ్, మెమరీ.. దీనిలో 3 జీబీ ర్యామ్ తో పాటు మరో 3జీబీ వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. 64జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 512 జీబీ వరకూ ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు.కెమెరా సిస్టమ్.. ఈ ఫోన్ వెనుక వైపు 13ఎంపీ కెమెరా, వీజీఏ సెంకడరీ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కనెక్టెవిటీ.. 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో, 4జీ కనెక్టివీటీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ 10 వాట్ల చార్జింగ్ సపోర్టుతో కూడిన 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ధర, లభ్యత..

లావా యువ 2 స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ రంగులలో గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 6,999గా ఉంది. లావా రిటైల్ నెట్‌వర్క్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..