Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gmail: మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? అయితే మీకో అలర్ట్.. ఇది చేయకపోతే మీ ఖాతా డిలీట్ అయిపోతుంది! పూర్తి వివరాలు ఇవి..

కొంతమందికి ఒకటికి మించిన జీమెయిల్ అకౌంట్లు కూడా ఉంటాయి. కానీ తరచూ వినియోగించే మెయిల్ ఐడీ ఒకటే ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఇలానే చేస్తుంటే.. మీరు చాలా కాలం నుంచి ఉపయోగించని జీమెయిల్ ఖాతా శాశ్వతంగా డిలీట్ అయిపోయే చాన్స్ ఉంది. ఈ మేరకు గూగుల్ ఓ కీలకమైన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Gmail: మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? అయితే మీకో అలర్ట్.. ఇది చేయకపోతే మీ ఖాతా డిలీట్ అయిపోతుంది! పూర్తి వివరాలు ఇవి..
Gmail
Follow us
Madhu

|

Updated on: Aug 02, 2023 | 4:00 PM

జీమెయిల్.. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకూ అందరూ వినియోగిస్తారు. సమాచార మార్పిడికి అద్భుతమైన సాధనం. దీని గురించి తెలియని వారుండరు. కొంతమందికి ఒకటికి మించిన జీమెయిల్ అకౌంట్లు కూడా ఉంటాయి. కానీ తరచూ వినియోగించే మెయిల్ ఐడీ ఒకటే ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఇలానే చేస్తుంటే.. మీరు చాలా కాలం నుంచి ఉపయోగించని జీమెయిల్ ఖాతా శాశ్వతంగా డిలీట్ అయిపోయే చాన్స్ ఉంది. ఈ మేరకు గూగుల్ ఓ కీలకమైన ప్రకటన చేసింది. డిసెంబర్ 31 నాటికి ఉపయోగించని జీమెయిళ్లను డిలీట్ చేయనున్నట్లు ప్రకటించింది. అది ఎందుకు చేయాల్సి వస్తుందో కూడా వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వినియోగదారుడి డేటాకు ప్రమాదం..

ఎక్కువకాలంగా వినియోగంలో లేని జీమెయిల్ ఖాతాల వల్ల వినియోగదారుల డేటాకు భద్రత ఉండదని, టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా చేసి ఉండరు కాబట్టి సులువుగా ఆ మెయిల్స్ లోని వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుందని గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలి చెప్పారు.

ఎప్పుడు డిలీట్ చేస్తారంటే..

మీరు గత రెండేళ్లలో మీ గూగుల్ కి సైన్ ఇన్ చేయకుంటే , అది తొలగింపుకు అర్హత పొందుతుంది. అయితే, జీమెయిల్, డ్రైవ్, డాక్స్, ఫొటోస్, మీట్, క్యాలెండర్ వంటి ఇతర సేవల నుండి ఖాతా, డేటాను తొలగించే ముందు, గూగుల్ వినియోగదారులకు సమాచారం ఇస్తుంది. రికవరీ మెయిల్ ఉంటుంది కాబట్టి దానికి ఈ మెయిల్స్ ను పంపుతుంది. డేటా దుర్వినియోగం కాకుండా ఆ తర్వాత అకౌంట్ ను డిలీట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇలా ఉంటే డిలీట్ చేయదు..

ఒక్కసారి ఖాతా డిలీట్ చేసిన తర్వాత ఆ ఈమెయిల్ ఐడీతో తిరిగి మీరు లాగిన్ చేయలేరు. అందుకే మీరు అరుదుగా ఉపయోగించే మీ ఖాతాను అలాగే ఉంచుకోవాలనుకుంటే, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లాగిన్ చేయాలి. అప్పుడు గూగుల్ దానిని యాక్టివ్ లోనే ఉంచుతుంది. తద్వారా మీరు ఇమెయిల్‌లను పంపవచ్చు లేదా చదవవచ్చు, గూగుల్ డిస్క్‌ని ఉపయోగించవచ్చు, యూ ట్యూబ్ లో శోధించవచ్చు లేదా వీడియోలను చూడవచ్చు ఇతర వెబ్‌సైట్‌లలో గూగుల్ తో సైన్ ఇన్ చేయవచ్చు.

కామెంట్‌లు, ఛానెల్‌లు, వీడియోల వంటి యూట్యూబ్ యాక్టివిటీ ఉన్న ఖాతాలు లేదా మానిటరీ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలు తొలగించబడవని గూగుల్ పేర్కొంది. మీరు ఇకపై గూగుల్ ఖాతాను ఉపయోగించకపోతే, దానితో అనుబంధించబడిన మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేయడానికి మీరు ‘గూగుల్ టేక్ అవుట్ సేవను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీ ఖాతా ఒక నిర్దిష్ట వ్యవధిలో ఇన్ యాక్టివ్ గా ఉంటే మీకు గుర్తు చేసుకోవడానికి మీరు కంపెనీ ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ ను వినియోగించుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..