LIC WhatsApp Services: వాట్సాప్‌లో ఎల్ఐసీ సేవలు.. ‘హలో’ అంటే చాలు.. సమస్త వివరాలు వచ్చేస్తాయి..
సేవలను మరింత మెరుగుపరచేందుకు, ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా సేవలను అందించేందుకు మరో ముందడుగు వేసింది ఎల్ఐసీ. అదేంటంటే ఎల్ఐసీ వాట్సాప్ సర్వీస్. తన పాలసీదారులకు కోసం ఎల్ఐసీ వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ వెబ్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు ఈ సేవలను ఆస్వాదించడానికి అర్హులు.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు దేశ వ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు. లెక్కకు మించి ఉన్న వివిధ రకాల పాలసీలను పెద్ద ఎత్తున ప్రజలు తీసుకొంటూ ఉంటారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడలో ఎల్ఐసీ కూడా ఎప్పుడూ ముందే ఉంటుంది. క్లయిమ్ సెటిల్ మెంట్లప్పుడు కూడా ఎల్ఐసీ వేగంగా పనిచేస్తుంటుంది. ఈ సేవలను మరింత మెరుగుపరచేందుకు, ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా సేవలను అందించేందుకు మరో ముందడుగు వేసింది ఎల్ఐసీ. అదేంటంటే ఎల్ఐసీ వాట్సాప్ సర్వీస్. తన పాలసీదారులకు కోసం ఎల్ఐసీ వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ వెబ్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు ఈ సేవలను ఆస్వాదించడానికి అర్హులు. దీని ద్వారా పాలసీదారులు ప్రీమియం సమాచారం, యులిప్ ప్లాన్ స్టేట్‌మెంట్‌ల వంటి అనేక రకాల ప్రయోజనాలను పొందేందుకు వాట్సాప్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీ వాట్సాప్ సేవలను ఎలా వినియోగించుకోవాలి. తెలుసుకుందాం రండి..
ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్(www.licindia.in)లో తమ పాలసీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పాలసీదారులను ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో కోరింది. ఆ తర్వాత వాట్సాప్ సేవలను ప్రారంభించడానికి ఎల్ఐసీ అధికారిక వాట్సాప్ నంబర్ అయిన 8976862090ను ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ నంబర్ ను వాట్సాప్ లో ఓపెన్ చేసి, చాట్ బాక్స్ లో హలో అని మెసేజ్ చేయాలి. మీకు అప్పుడు 11 ఆప్షన్లతో కూడిన రిప్లై వస్తుంది. మీకు అవసరమైన సేవను ఎంచుకోవడానికి, ఆ పదకొండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని, దానికి పక్కన ఉన్న నంబర్ తో రిప్లై ఇవ్వండి. దానికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు ఎల్ఐసీ అందిస్తుంది.
వాట్సాప్ ద్వారా ఎల్ఐసీ అందించే సేవలు..
- ప్రీమియం బకాయి
- బోనస్ సమాచారం
- పాలసీ స్థితి
- లోన్ అర్హత కొటేషన్
- లోన్ రీపేమెంట్ కొటేషన్
- లోన్ వడ్డీ
- చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించిన సర్టిఫికెట్
- యులిప్ -యూనిట్‌ల స్టేట్‌మెంట్
- ఎల్ఐసీ సేవల లింక్‌లు
- ఆప్ట్ ఇన్/ఆప్ట్ అవుట్ సర్వీస్లు
మీరు కొత్త వినియోగదారు అయితే, ఎల్ఐసీ వాట్సాప్ సేవ కూడా ఎంచుకోవడానికి వివిధ ప్లాన్‌లను అందిస్తుంది.
ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..
- ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ www.licindia.in ని సందర్శించండి.
- “కస్టమర్ పోర్టల్” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- “కొత్త వినియోగదారు” క్లిక్ చేసి, మీరు కొత్త వినియోగదారు అయితే ఫారమ్‌ను పూరించండి.
- మీ వినియోగదారు ఐడీ, పాస్‌వర్డ్‌ని ఎంచుకున్న తర్వాత, మీ సమాచారాన్ని సమర్పించండి.
- ఆన్‌లైన్ పోర్టల్ కోసం సైన్ అప్ చేయడానికి మీ యూజర్ ఐడీని ఉపయోగించండి.
- “బేసిక్ సర్వీసెస్” జాబితా నుంచి “యాడ్ పాలసీ” ఎంచుకోండి.
- రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి మీ ప్రతి పాలసీ గురించిన సమాచారాన్ని నమోదు చేయండి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..