AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noise Airwave: నాయిస్‌ నుంచి రాకింగ్‌ నెక్‌బ్యాండ్‌.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు

బ్లూటూత్‌ ఇయర్‌ బడ్స్‌ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు కచ్చితంగా బ్లూటూత్‌ నెక్‌ బ్యాండ్స్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెక్‌బ్యాండ్స్‌ డిమాండ్‌ అమాంతం పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్నికంపెనీలు సూపర్‌ సౌండ్‌ క్వాలిటీతో బ్లూటూత్‌ నెక్‌బ్యాండ్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ యాక్ససరీస్‌ తయారీ సంస్థ అయిన నాయిస్‌ సరికొత్త నెక్‌బ్యాండ్‌ను రిలీజ్‌ చేసింది. నాయిస్‌ ఎయిర్‌ వేవ్‌ పేరుతో లాంచ్‌ చేసిన ఈ నెక్‌బ్యాండ్‌ ధర రూ.999గా పేర్కొంది.

Noise Airwave: నాయిస్‌ నుంచి రాకింగ్‌ నెక్‌బ్యాండ్‌.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు
Noise Airwave
Nikhil
|

Updated on: Feb 03, 2024 | 6:30 AM

Share

ప్రస్తుత రోజుల్లో యువత స్మార్ట్‌ యాక్సరీస్‌ వాడకాన్ని విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉండడంతో స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్‌ చేసి వాడే వివిధ యాక్ససరీస్‌ ప్రజాదరణ పొందాయి. వీటిల్లో ముఖ్యంగా మ్యూజిక్‌ లవర్స్‌కు ఎక్కువగా బ్లూటూత్‌ నెక్‌ బ్యాండ్స్‌ను ఇష్టపడుతున్నారు. బ్లూటూత్‌ ఇయర్‌ బడ్స్‌ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు కచ్చితంగా బ్లూటూత్‌ నెక్‌ బ్యాండ్స్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెక్‌బ్యాండ్స్‌ డిమాండ్‌ అమాంతం పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్నికంపెనీలు సూపర్‌ సౌండ్‌ క్వాలిటీతో బ్లూటూత్‌ నెక్‌బ్యాండ్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ యాక్ససరీస్‌ తయారీ సంస్థ అయిన నాయిస్‌ సరికొత్త నెక్‌బ్యాండ్‌ను రిలీజ్‌ చేసింది. నాయిస్‌ ఎయిర్‌ వేవ్‌ పేరుతో లాంచ్‌ చేసిన ఈ నెక్‌బ్యాండ్‌ ధర రూ.999గా పేర్కొంది. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు అందించే నాయిస్‌ వేవ్‌ నెక్‌ బ్యాండ్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

50 గంటల బ్యాటరీ లైఫ్‌తో భారతదేశంలో కొత్త నెక్‌బ్యాండ్  నాయిస్ ఎయిర్‌వేవ్‌ అందరినీ ఆకర్షిస్తుందని నాయిస్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ నెక్‌బ్యాంక్‌ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఈఎన్‌సీ)తో పాటు మూడు ఈక్యూ మోడ్‌లు, ఐపీఎక్స్‌ 5 రేటింగ్‌తో వస్తుంది. అలాగే ఈ నాయిస్ ఎయిర్‌వేవ్ భారతీయ వినియోగదారులకు రూ. 999కు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌తో నాయిస్‌ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే ఈ నెక్‌బ్యాండ్‌  జెట్ బ్లాక్, ఐస్ బ్లూ, ఆలివ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ అనే నాలుగు రంగుల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉంటుంది. నాయిస్ ఎయిర్‌వేవ్ నెక్‌బ్యాండ్ ఒక సంవత్సరం వారెంటీతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

నాయిస్ ఎయిర్‌వేవ్ ఫీచర్‌లు

  • సరికొత్త నాయిస్ ఎయిర్‌వేవ్ నెక్‌బ్యాండ్ 10 ఎంఎం డ్రైవర్లతో అమర్చి ఉంటుంది. అందువల్ల మెరుగైన ఆడియో నాణ్యతతో పాటు మంచి పనితీరును నిర్ధారిస్తుంది.
  • ఈ నెక్‌బ్యాండ్‌ అల్ట్రా-తక్కువ జాప్యాన్ని కలిగి ఉంది. ఆడియో ప్రసారంలో ఆలస్యాన్ని 50 ఎంఎస్‌వరకు తగ్గిస్తుంది.
  • నాయిస్ ఎయిర్‌వేవ్ వినియోగదారు స్నేహపూర్వక, అనుకూలమైన ఆపరేషన్ కోసం టచ్ నియంత్రణలను కలిగి ఉంటుంది.
  • నాయిస్‌ నెక్‌బ్యాండ్ సమర్థవంతమైన వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వీ5.3ని ఉపయోగిస్తుంది.
  • కాల్‌లు, వినోదం, వివిధ జీవనశైలి కార్యకలాపాలకు స్పష్టమైన ధ్వని అనుభూతిని అందించడానికి ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ కాన్సిలేషన్‌ సాంకేతికతను కలిగి ఉంది. 
  • నాయిస్ ఎయిర్‌వేవ్ అనుకూలీకరించదగిన ఆడియో అనుభవాల కోసం మూడు అంతర్నిర్మిత ఈక్యూ (ఈక్వలైజర్) మోడ్‌లతో సౌలభ్యాన్ని అందిస్తుంది – ట్రూ బాస్, ట్రూ బ్యాలెన్స్‌డ్, ట్రూ రాక్‌ మంచి మ్యూజిక్‌ను ఆశ్వాదించవచ్చు. 
  • నాయిస్ ఎయిర్‌వేవ్ ఒక ఛార్జ్‌పై మొత్తం ప్లేబ్యాక్ సమయాన్ని 50 గంటల వరకు అందిస్తుంది.
  • నాయిస్‌ ఎయిర్‌ వేవ్‌ నెక్‌ బ్యాండ్‌ స్ప్లాష్, చెమట నిరోధకత కోసం ఐపీఎక్స్‌ 5 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది వివిధ వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..