- Telugu News Photo Gallery Technology photos Indian smart phone brand Lava launching new smart phone lava yuva 3 leaked features and price details
Lava Yuva 3: లావా నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్
మార్కెట్లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను తీసుకురావడంలో ముందు వరుసలో ఉండే బ్రాండ్ లావా. భారత్‌కు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసే పనిలో పడింది. లావా యువ 3 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని విషయాలు పంచుకుంది..
Updated on: Feb 02, 2024 | 9:34 PM

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ లావా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. లావా యువ2 స్మార్ట్ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఈ ఫోన్‌కు సంబంధించి లావా ప్రకటన చేసింది.

త్వరలోనే భారత్‌లో సేల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇక కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ, నెట్టింట కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి.

వీటి ప్రకారం లావా యువ 3 స్మార్ట్ ఫోన్ ధర రూ. 9 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను 64 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫోన్ స్క్రీన్ విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ ఆక్టాకోర్ యూనిఎస్‌ఓసీ టీ616 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని సమాచారం. ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించనున్నారు.

లావా యువ 3 స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందిచనున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. టైప్‌సీ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, మైక్‌ను అందించనున్నారు.




