- Telugu News Photo Gallery Technology photos Nothing launching new smart phone Nothing phone 2a features and price details
Nothing Phone 2a: నథింగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ కూడా అదుర్స్
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. వైవిధ్యమైన డిజైన్‌తో రూపొందించిన ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే నథింగ్ 1, నథింగ్ 2 ఫోన్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నథింగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. నథింగ్ ఫోన్ 2ఏ పేరుతో ఈ ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు..
Updated on: Feb 02, 2024 | 9:42 PM

నథింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2లకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే నథింగ్ ఫోన్2ఏ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికగా నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను మిడ్ రేంజ్ బడ్జెట్‌తో లాంచ్ చేయనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.

నథింగ్ ఫోన్2ఏ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 33,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 120 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఓఎల్ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. 6.7 ఇంచ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200ఎస్ఓసీ చిప్‌సెట్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది.

నథింగ్ ఫోన్2ఏ కెమెరా విషయానికొస్తే ఇందులో డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది.




