- Telugu News Photo Gallery Technology photos Acer update its Acer Swift Go 14 laptop with Artificial intelligence Check here for full details
Acer Swift Go 14: ఏఐ టెక్నాలజీతో కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్స్ అదుర్స్ అంతే..
ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ అసెర్ స్విఫ్ట్‌జీయో 14 ల్యాప్‌టాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ కంపెనీ నుంచి ఇది వరకే వచ్చిన స్విఫ్ట్ జీయో14 ల్యాప్‌టాప్‌ను తాజాగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీని ఇందులో అందించారు. ఇంతకీ ఈ అప్‌డేట్‌డ్ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 01, 2024 | 9:41 PM

ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ అసెర్ అప్‌డేటేడ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. గతంలో తీసుకొచ్చిన స్విఫ్ట్ జీఓ14 ల్యాప్‌టాప్‌ను AI సపోర్ట్ కలిగిన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌లతో అప్‌డేట్ చేసి విడుదల చేసింది.

ఈ ల్యాప్‌టాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫంక్షలను మెరుగుపరచడానికి ఈ ఎన్‌పీయూలు మరింత ఉపయోగపడుతాయని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో రెండు ప్రాసెసర్‌లను అందించారు.

ధర విషయానికొస్తే.. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 CPUతో పనిచేసే ల్యాప్‌టాప్ ధర రూ. 84,990, కోర్ అల్ట్రా 7 వేరియంట్ ధర రూ.99,990గా నిర్ణయించారు. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులోకి వచ్చింది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్‌తో కూడిన ఊపీఎల్ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ సొంతం. ఈ ల్యాప్‌టాప్‌ను 16జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇవి పాత మోడళ్ల కంటే 47 శాతం మెరుగైన పనితీరుతో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఏసర్ స్విఫ్ట్ గో14 ల్యాప్‌టాప్‌లో ఏఐతో రూపొందించిన డెప్త్ మ్యాప్‌లను 3డీలలో కూడా వీక్షించవచ్చు. వీడియో కాల్స్ కోసం 1440p QHD వెబ్‌క్యామ్‌ను అందించారు. దీనిలో మూడు-సెల్ 65W బ్యాటరీని అమర్చారు. దీంతో అత్యధికంగా 12.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ తెలిపింది.




