- Telugu News Photo Gallery Technology photos Instagram testing on new privacy feature flipside, Check here for full details
Instagram: ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్.. దీని ఉపయోగం ఏంటంటే..
ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇన్‌స్టా ఇప్పుడు ఫేస్‌బుక్‌ను మించిపోతోంది. ముఖ్యంగా యువత ఈ సోషల్ మీడియాను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఇతర సోషల్ మీడియా సంస్థల నుంచి పోటీని తట్టుకొని నిలబడడానికి ప్రధాన కారణం, ఇన్‌స్టాగ్రామ్ ప్రైవసీకి ఇచ్చే ప్రాధాన్యతనే..
Updated on: Feb 01, 2024 | 10:09 PM

ప్రైవసీకి పెట్టింది పేరైనా ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటికే యూజర్ల వ్యక్తిగత భద్రతకు పెద్దపీట వేసిన ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మరో ప్రైవసీ పీచర్‌ను తీసుకొస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, రీల్స్, స్టోరీలను ఎంపిక చేసిన వారికి మాత్రమే కనిపించేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఫ్లిప్‌సైడ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ విషయమాన్ని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం పట్టనుంది. ఈ ఫీచర్‌కు సంబంధించి గతేడాదే ప్రముఖ డెవలపర్ అలెశాండ్రో పలుజ్జీ పేర్కొన్నారు.

అయితే ఇన్‌స్టాగ్రామ్ మాత్రం ఇప్పటి వరకు ఈ ఫీచర్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫీచర్‌తో ప్రస్తుత ప్రొఫైల్‌కు ప్రత్యామ్నాయ అకౌంట్‌గా మారుతుంది. ఈ అకౌంట్ ప్రాథమిక ఖాతాతో లింక్ అయి ఉంటుంది. అలాగే, యూజర్లు తమకు నచ్చిన పేరు, బయో, ఫొటోతో వ్యక్తిగతీకరించిన ప్రొఫైల్‌లను సృష్టించుకోవచ్చు.

దీంతో ఈ ప్రొఫైల్‌లో యూజర్లు ఏదైనా పోస్ట్ లేదా రీల్స్‌ను తమకు నచ్చిన వారికి మాత్రమే కనిపించేలా షేర్ చేసుకోవచ్చు. వ్యక్తిగత ప్రైవసీ, తాము పోస్ట్ చేసే కంటెంట్‌ను కేవలం కొందరు మాత్రమే చూడాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.




