Food Crisis Solution: మొక్కలు పెరగడానికి నీరు లేకపోయినా ఆల్కహాల్ చాలు అంటోన్న శాస్త్రవేత్తలు..

ముఖ్యంగా నీటి కొరత వలన వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. దీంతో పంట దిగుబడి, ఉత్పత్తి, నాణ్యత గణనీయంగా తగ్గనుంది. ఈ నేపథ్యంలో మొక్కలను పెంచడానికి వ్యవసాయోత్పత్తుల దిగుబడి అధికమవ్వడానికి నీటికి బదులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నాడు.

Food Crisis Solution: మొక్కలు పెరగడానికి నీరు లేకపోయినా ఆల్కహాల్ చాలు అంటోన్న శాస్త్రవేత్తలు..
Food Crisis Solution
Follow us
Surya Kala

|

Updated on: Aug 29, 2022 | 9:49 AM

Food Crisis Solution: ఆధునికత పేరుతో మానవాళి చేస్తోన్న పనులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కాలాల్లో మార్పులు వచ్చాయి. విపరీతమైన ఎండలు, భారీ వర్షాలుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వేడి, వేడిగాలులు పెరిగిపోతూ ఉండంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మంచు కరిగిపోతోంది. నదులు ఎండిపోతున్నాయి. సరస్సులు, నదులు, ఇతర మంచి నీటి వనరుల్లో నీరు ఆవిరైపోతూ.. ఎండిపోతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నీటి కొరత తప్పదని ప్రకృతి ప్రేమికులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నీటి కొరతతో మానవాళి సహా వృక్ష సంపద కూడా ముప్పుని ఎదుర్కోనుంది. ముఖ్యంగా నీటి కొరత వలన వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. దీంతో పంట దిగుబడి, ఉత్పత్తి, నాణ్యత గణనీయంగా తగ్గనుంది. ఈ నేపథ్యంలో మొక్కలను పెంచడానికి వ్యవసాయోత్పత్తుల దిగుబడి అధికమవ్వడానికి నీటికి బదులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నాడు.

ఆ దిశగా ప్రయత్నాలను చేస్తున్నాడు. దీంతో మొక్కల పెంపకం విషయంలో శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యయనాన్ని సృష్టించనున్నారు. అవును కరువు సమయంలో మొక్కల పెంపకం కోసం నీటికి బదులు ఇథనాల్ (ఆల్కహాల్) ను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు ఓ అధ్యయనాన్ని జపాన్‌లోని రికెన్ (RIKEN) సెంటర్ ఫర్ సస్టైనబుల్ రిసోర్స్ సైన్స్‌లో ఆగస్టు 25న‌ ప్రచురించారు.

మొక్కల పెంపకం ప్రత్యామ్నాయలపై ‘ప్లాంట్ అండ్ సెల్ ఫిజియాలజీ’  పేరుతో ఓ బృందం అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనానికి మోటోఆకీ సెకీ నాయకత్వం వహించారు.  మొక్కల పెంపకంలో ఇథనాల్ వాడ‌టం వ‌ల్ల.. నీరు లేకుండా సుమారు 2 వారాల పాటు జీవించ గ‌ల‌వని పేర్కొన్నారు. మొక్కలు జీవించడానికి సరిపడా నీరు లేని సమయంలో మొక్కల నుంచి సహజంగానే ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని అధ్య‌య‌నంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

పరిశోధనల్లో భాగంగా పరిశోధకులు గోధుమలు, వరి మొక్కలను పెంచారు. వాటికి క్రమం తప్పకుండా నీరు పోశారు. ఆపై మూడు రోజులలో ఒక సమూహంలోని మొక్కలకు ఇథనాల్‌ను మట్టికి జోడించారు. వారు రెండు వారాల పాటు రెండు గ్రూపుల మొక్కలు నీటిని కోల్పోయాయి. ఈ పరిశోధనలో దాదాపు 75% ఇథనాల్ వేసిన గోధుమ, వరి మొక్కలు తిరిగి నీరు పోసిన అనంతరం మనుగడ సాగించినట్లు గుర్తించారు. అయితే ఇథనాల్ అధిక సాంద్రత మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది” కనుక ఇథనాల్‌ను చాలా తక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇంకా చెప్పాలంటే, ఇంట్లో దీన్ని ప్రయత్నించవద్దని కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.