Google Meet: గూగుల్ మీట్ ను ఎక్కువ ఉపయోగిస్తున్నారా.. ఈ కొత్త షార్ట్ కట్ తెలుసుకోండి..

నేటి ఆధునిక యుగంలో ఫేస్ టు ఫేస్ మీటింగ్ ల కంటే ఆన్ లైన్ సమావేశాలకే అందరూ అలవాటుపడ్డారు. దీని ద్వారా సమయం ఆదాతో పాటు ఖర్చు తగ్గుతుంది. ఈఆన్ లైన్ మీటింగ్స్ కోసం ఎన్నో యాప్ లు ఉన్నప్పటికి చాలామంది..

Google Meet: గూగుల్ మీట్ ను ఎక్కువ ఉపయోగిస్తున్నారా.. ఈ కొత్త షార్ట్ కట్ తెలుసుకోండి..
Google Meet
Follow us

|

Updated on: Aug 29, 2022 | 10:48 AM

Google Meet: నేటి ఆధునిక యుగంలో ఫేస్ టు ఫేస్ మీటింగ్ ల కంటే ఆన్ లైన్ సమావేశాలకే అందరూ అలవాటుపడ్డారు. దీని ద్వారా సమయం ఆదాతో పాటు ఖర్చు తగ్గుతుంది. ఈఆన్ లైన్ మీటింగ్స్ కోసం ఎన్నో యాప్ లు ఉన్నప్పటికి చాలామంది వాడేది గూగ్ ల్ మీట్.. మరి ఈగూగుల్ మీట్ లో కొత్త ఆప్షన్స్, సరికొత్త షార్ట్ కట్ ఒకటి అందుబాటులోకి వస్తోంది. అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కువ గూగుల్ మీట్ వాడేవారు ఒక్కోసారి.. అన్​మ్యూట్​ చేసిన తర్వాత.. మళ్లీ మ్యూట్​ చేయడం మర్చిపోతూ ఉంటారు. ఎవరూ వినట్లేదు కదా అని.. మనకు నచ్చినది మాట్లాడేస్తూ ఉంటాం. ఇక నుంచి అలాంటి టెన్షన్ అవసరం లేదు. అలాంటి వారి కోసం గూగుల్ కొత్త షార్ట్ కట్ ను అందుబాటులోకి తేనుంది. గూగుల్ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్​ను అందిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా.. గూగుల్​ మీట్​కు కొత్త ‘షార్ట్​కట్​’ రాబొతున్నట్టు తెలుస్తోంది. వీడియో కాల్​లో ఉన్నప్పుడు.. అన్​మ్యూట్​ చేసుకునేందుకు ఈ షార్ట్​కట్​ ఉపయోగపడుతుందని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కొత్త షార్ట్​కట్​తో.. స్పేస్​బార్​ ద్వారా అన్​మ్యూట్​ అవ్వొచ్చు. అవును.. స్పేస్​బార్​ని ప్రెస్​ చేసి, కొన్ని సెకన్ల పాటు పట్టుకుంటే.. వీడియో అన్​మ్యూట్​ అవుతుంది. స్పేస్​బార్​ని వదిలేస్తే.. మళ్లీ మ్యూట్​ అయిపోతుంది.మీటింగ్స్​లో తొందరగా మనల్ని మనం అన్​మ్యూట్​ చేసుకునేందుకు.. స్పేస్​బార్​ని పట్టుకోవాలి. స్పేస్​బార్​ వదిలేస్తే మళ్లీ మ్యూట్​ అయిపోతుంది.

గూగుల్​ మీట్​కు ఈ కొత్త షార్ట్​కట్​ ఎంతో ఉపయోగకరం అని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. అన్​మ్యూట్​ చేసిన తర్వాత.. మ్యూట్​ చేయడం మర్చిపోయే సందర్భాల నుంచి తప్పించుకోవాలంటే ఈ షార్ట్​కట్​ పనికొస్తుందని అంటున్నారు. చాలా మంది.. అన్​మ్యూట్​ చేసిన తర్వాత మళ్లీ మ్యూట్​ చేయడం మర్చిపోతూ ఉంటారు. మ్యూట్​లోనే ఉంది అనుకుని.. ఇష్టం వచ్చింది మాట్లాడేసి నాలుక కరుచుకుంటారు. వారందరికి ఈ ఫీచర్​ బాగా ఉపయోగపడనుంది. గూగుల్​ మీట్​లో ఈ కొత్త షార్ట్​కట్​.. సెప్టెంబర్​ 9 నుంచి అందుబాటులోకి రానుంది. డీఫాల్ట్​గానే యాప్​లోకి వచ్చేస్తుంది. కొత్తగా ఎలాంటి డౌన్​లోడ్​లు చేసుకోవాల్సిన అవసరం లేదని గూగుల్ సంస్థ తెలిపింది. గూగుల్​ మీట్​ సెట్టింగ్స్​లో ఎనేబుల్​ చేసుకుంటే చాలు. వర్క్​స్పేస్​ కస్టమర్లు, పర్సనల్​ గూగుల్​ అకౌంట్స్​ ఉన్న వారందరికీ ఈ షార్ట్​కట్​ అందుబాటులో ఉంటుందని గూగుల్​ సంస్థ ప్రకటించింది. ఈకొత్త షార్ట్ కట్ తో పాటు గూగుల్ మీట్ లో ఎన్నో సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇటీవలే సంస్థ తెలిపింది. గూగుల్ డుయో ఫీచర్స్ అన్నింటినీ గూగుల్ మీట్‌లోకి తీసుకొస్తూ.. డుయో, మీట్‌లను సింగిల్ ప్లాట్‌ఫారమ్‌గా విలీనం చేయనున్నారు. గూగుల్ మీట్ యూజర్లకు కేవలం వీడియో కాలింగ్ సదుపాయం ఒక్కటే కాకుండా షెడ్యూలింగ్, జాయినింగ్ మీటింగ్స్, వర్చువల్ బ్యాక్ ‌గ్రౌండ్స్, ఇన్-మీటింగ్ చాటింగ్ వంటి కొత్త సదుపాయాలను అందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..

Latest Articles
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా పర్సనల్ లోన్ సాధ్యమే..!
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా పర్సనల్ లోన్ సాధ్యమే..!
కాకరకాయ ఉల్లి కారం ఇలా చేశారంటే.. ఇష్టం లేకున్నా తినేస్తారు!
కాకరకాయ ఉల్లి కారం ఇలా చేశారంటే.. ఇష్టం లేకున్నా తినేస్తారు!
ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని ఎంఎస్ ధోని.. వీడియో వైరల్
ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని ఎంఎస్ ధోని.. వీడియో వైరల్
క్రిస్పీ బేబీకార్న్ రైస్‌ ఇలా చేశారంటే.. పిల్లలకు బాగా నచ్చుతుంది
క్రిస్పీ బేబీకార్న్ రైస్‌ ఇలా చేశారంటే.. పిల్లలకు బాగా నచ్చుతుంది
బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గుతుందా..? నమ్మలేని నిజాలు మీకోసం
బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గుతుందా..? నమ్మలేని నిజాలు మీకోసం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? డేంజర్ జోన్ నుంచి బయటపడాలంటే..
రక్తహీనతతో బాధపడుతున్నారా..? డేంజర్ జోన్ నుంచి బయటపడాలంటే..
ఈ చవకైన డ్రై ఫ్రూట్ ప్రతి అవయవానికి బలాన్నిస్తుంది...యవ్వనంగా..
ఈ చవకైన డ్రై ఫ్రూట్ ప్రతి అవయవానికి బలాన్నిస్తుంది...యవ్వనంగా..
కారు లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్..!
కారు లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్..!
రాగులతో ఒక్కసారి ఇలా గారెలు చేయండి.. టేస్ట్ వేరే లెవల్..
రాగులతో ఒక్కసారి ఇలా గారెలు చేయండి.. టేస్ట్ వేరే లెవల్..
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..