Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Bharat B1: రిలయన్స్‌ జియో నుంచి మరో కొత్త ఫోన్‌.. రూ. 1300కే 4జీ సపోర్ట్‌..

కంపెనీ వెబ్‌సైట్‌లో జియో భారత్‌ బీ1 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కంపెనీ లిస్ట్‌ చేసింది. ఇంతకు ముందు లాంచ్‌ చేసిన ఫోన్‌లతో పోల్చితే ఈ కొత్త 4జీ ఫోన్‌లో స్క్రీన్‌ సైజ్‌ను పెద్దగా ఇచ్చారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 2000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. జియో వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. ధర విషయానికొస్తే జియో భారత్‌ బీ1 ఫోన్‌ ధర రూ. 1299గా ఉంది. ఈ ఫోన్‌కు బ్యాక్‌ కెమెరా కూడా...

Jio Bharat B1: రిలయన్స్‌ జియో నుంచి మరో కొత్త ఫోన్‌.. రూ. 1300కే 4జీ సపోర్ట్‌..
Jio Bharat B1
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 13, 2023 | 2:32 PM

రిలయన్స్‌ జియో మరో బడ్జెట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. జియో భారత్‌ సిరీస్‌లో భాగంగా ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జియో భారత్‌ బీ1 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చార. గతంలో జియో భారత్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే వీ2, కే1 కార్బన్‌ మోడల్స్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో ఈ ఫోన్‌లకు అదనపు ఫీచర్లను అందించారు.

కంపెనీ వెబ్‌సైట్‌లో జియో భారత్‌ బీ1 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కంపెనీ లిస్ట్‌ చేసింది. ఇంతకు ముందు లాంచ్‌ చేసిన ఫోన్‌లతో పోల్చితే ఈ కొత్త 4జీ ఫోన్‌లో స్క్రీన్‌ సైజ్‌ను పెద్దగా ఇచ్చారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 2000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. జియో వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. ధర విషయానికొస్తే జియో భారత్‌ బీ1 ఫోన్‌ ధర రూ. 1299గా ఉంది. ఈ ఫోన్‌కు బ్యాక్‌ కెమెరా కూడా అందించారు. అయితే కెమెరా క్లారిటీ ఎంత అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

ఈ ఫీచర్ ఫోన్‌లో జియోపే యాప్‌ను డీఫాల్ట్‌గా అందించారు. దీంతో యూపీఐ పేమెంట్స్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో అన్నీ యాప్స్‌ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయి. ఈ ఫీచర్‌ ఫోన్‌ మొత్తం 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్‌లో కేవలం జియో సిమ్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇతర సిమ్‌లను ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఫోన్‌ను కేవలం బ్లాక్‌ కలర్‌లో మాత్రమే లాంచ్‌ చేశారు. జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

ఇక జియో భారత్‌ బీ1 ఫోన్‌ 0.5 బీబీ ర్యామ్‌తో పని చేస్తుంది. ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ కెపాసిటీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్‌, వైఫై, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ వంటి ఫీచర్స్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 343 గంటలు ఏకధాటిగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.3.5 ఎమ్‌ఎమ్‌ హెడ్‌ఫోన్‌ జాక్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ బరువు 110 గ్రాములుగా ఉండనుంది. ఇక ఈ ఫోన్‌లో జియో సినిమా, జియోసావన్‌ వంటి యాప్స్‌ ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరణించినా .. ప్రాణదాతగా నిలిచిన యువ డాక్టర్..!వీడియో
మరణించినా .. ప్రాణదాతగా నిలిచిన యువ డాక్టర్..!వీడియో
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.8.5లక్షల కోట్లతో..
ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్‌.. ఏకంగా ఏడాదిపాటు..
బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్‌.. ఏకంగా ఏడాదిపాటు..
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ
బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్‌ వీడియో
బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్‌ వీడియో
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్‌.. అలా ఎలా పెట్టావ్ పాప
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్‌.. అలా ఎలా పెట్టావ్ పాప
గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?
గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?