OnePlus 10 Pro: వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. అత్యాధునిక టెక్నాలజీ.. ఫీచర్స్‌, ఇతర వివరాలు..!

OnePlus 10 Pro: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో తక్కువ ధరల్లో మార్కెట్లోకి అందుబాటులోకి..

OnePlus 10 Pro: వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. అత్యాధునిక టెక్నాలజీ.. ఫీచర్స్‌, ఇతర వివరాలు..!
Oneplus 10 Pro
Follow us

|

Updated on: Jan 12, 2022 | 7:38 PM

OnePlus 10 Pro: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో తక్కువ ధరల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ నుంచి సరికొత్త మొబైళ్లు విడుదలవుతున్నాయి. ఇక తాజాగా ఈ వన్‌ప్లస్‌ 10ప్రో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్‌ 8జె1 చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది కంపెనీ. ప్రస్తుతం చైనాలో విడుదల కాగా, భారత్‌లో ఎప్పుడు విడుల అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు.

వన్‌ప్లస్‌ 10 ప్రో స్పెసిఫికేషన్స్‌:

6.7 అంగుళాల క్యూహెచ్‌డి+అమోల్డ్‌ డిస్‌ప్లే

ఆండ్రాయిడ్‌ 12 సపోర్ట్‌ గల కలర్‌ ఓఎస్‌ 12.1

కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్యానెల్‌ ప్రొటెక్షన్‌

క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8జెన్‌1చిప్‌

12జీబీ ఎల్‌పీడీడీఆర్‌ 5 ర్యామ్‌

కెమెరా: 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా

ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ కెమెరా – 50 మెగాపిక్సెల్

8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా

ఫ్రంట్‌ కెమెరా: 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ ఎక్స్615

బ్యాటరీ – 5,000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ

80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్

దీని ధర సుమారు రూ.58వేలకు పైగా ఉండే అవకాశం

ఇవి కూడా చదవండి:

Google Image: మీరు గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఫోటోలు నకిలీవా..?నిజమైనవా..? గుర్తించడం ఎలా..?

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? ఈ షార్ట్‌కట్ కీ గురించి తెలుసుకోండి..!