AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BlackBerry: బ్లాక్‌బెర్రీ ప్రేమికులకు శుభవార్త.. కీ బోర్డ్‌తో సరికొత్త 5G ఫోన్.. విడుదల ఎప్పుడంటే?

మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ అభిమానులకు శుభవార్త. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం, త్వరలో 5G సపోర్ట్‌తో కొత్త బ్లాక్‌బెర్రీ ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

BlackBerry: బ్లాక్‌బెర్రీ ప్రేమికులకు శుభవార్త.. కీ బోర్డ్‌తో సరికొత్త 5G ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
Blackberry 5g Phone
Venkata Chari
|

Updated on: Jan 12, 2022 | 7:38 PM

Share

BlackBerry 5G Phone: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ అభిమానులకు శుభవార్త. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం, త్వరలో 5G(5G Technology) సపోర్ట్‌తో కొత్త బ్లాక్‌బెర్రీ(BlackBerry) ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. బ్లాక్‌బెర్రీ 5G స్మార్ట్‌ఫోన్‌ను 2021 సంవత్సరంలో లాంచ్ చేస్తారని గతంలో పేర్కొంది. కానీ, అది జరగలేదు. కొత్త సంవత్సరం ప్రారంభంతో, కంపెనీ BlackBerry 10 OS లేదా అంతకు ముందు నడుస్తున్న అన్ని క్లాసిక్ స్మార్ట్‌ఫోన్‌లకు మద్దతు ఇవ్వడం ఆపివేసింది. ఆ తర్వాత బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్(Smartphone) కంపెనీ మూసివేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

బ్లాక్‌బెర్రీ కీబోర్డ్ ఆన్‌వర్డ్ మొబిలిటీతో లాంచ్ అవుతుంది తన తాజా బ్లాగ్ పోస్ట్‌లో పోస్ట్ చేసింది. దీంతో బ్లాక్‌బెర్రీ ముగింపు ఇంకా రాలేదని అభిమానులకు తెలియజేసింది. ఇది కాకుండా, 5G కనెక్టివిటీతో బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను 2022 సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ కీబోర్డ్‌తో రానున్నట్లు ప్రకటించింది.

అయితే 2021లో ఈ ఫోన్ లాంచ్ కావలసి ఉండగా, బ్లాక్‌బెర్రీ 5G ఫోన్ 2021లో విడుదల కాలేదు. 2021 సంవత్సరం కంపెనీకి చాలా సవాలుగా మారిందని, ఈ కారణంగా కంపెనీ కొత్త ఫోన్‌ని తీసుకురాలేకపోయిందని కంపెనీ తెలిపింది. అయితే ఇది బ్లాక్‌బెర్రీ ముగింపు అని భావించిన వారికి, కంపెనీ తన కొత్త బ్లాగ్-పోస్ట్ ద్వారా ఆ ఊహాగానాలన్నింటికీ ముగింపు పలికింది.

కొత్త 5G- రెడీ బ్లాక్‌బెర్రీ ఇంకా ఆలస్యమైందని, అయితే ఖచ్చితంగా లాంచ్ అవుతుందని తెలిపింది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ స్పెసిఫికేషన్‌ల వివరాలు ఏవీ తెలియచేయలేదు. ఈ ఫోన్ కీబోర్డ్‌తో వస్తుందని మాత్రమే ప్రకటించింది. అయితే, ప్రస్తుతానికి, కంపెనీ ఫోన్ పేరు, స్పెసిఫికేషన్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

Also Read: OnePlus 10 Pro: వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. అత్యాధునిక టెక్నాలజీ.. ఫీచర్స్‌, ఇతర వివరాలు..!

Google Image: మీరు గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఫోటోలు నకిలీవా..?నిజమైనవా..? గుర్తించడం ఎలా..?