Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Phone: అత్యంత చవకైన 5జీ ఫోన్.. 6జీబీ ర్యామ్, 50ఎంపీ కెమెరాతో.. లుక్ కూడా బాగుంది..

దేశంలో చవకైన ఫోన్లకు పెట్టింది పేరైన లావా మొబైల్స్ నుంచి మరో 5జీ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది కూడా తక్కువ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ పేరిట దీనిని కంపెనీ ఆవిష్కరించింది. ఇది గతేడాది విడుదలైన బ్లేజ్ 5జీ ఫోన్ కి  ఇది అప్ గ్రేడెడ్ వెర్షన్.

5G Phone: అత్యంత చవకైన 5జీ ఫోన్.. 6జీబీ ర్యామ్, 50ఎంపీ కెమెరాతో.. లుక్ కూడా బాగుంది..
Lava Blaze 1x 5g
Follow us
Madhu

|

Updated on: Apr 29, 2023 | 5:45 PM

దేశంలో చవకైన ఫోన్లకు పెట్టింది పేరైన లావా మొబైల్స్ నుంచి మరో 5జీ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది కూడా తక్కువ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ పేరిట దీనిని కంపెనీ ఆవిష్కరించింది. ఇది గతేడాది విడుదలైన బ్లేజ్ 5జీ ఫోన్ కి  ఇది అప్ గ్రేడెడ్ వెర్షన్. దీనిలో మరిన్నిఅధునాతన ఫీచర్లు ఉన్నాయి. గత మోడల్ లాగానే వెనుకవైపు ప్రీమియం గ్లాస్ బ్యాక్ ప్యానల్ ను దీనిలో కూడా అందించింది. ఫ్లాట్ ఫ్రేమ్, రియర్ ప్యానల్ ఉంది. ఇది సింగిల్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తోంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సామర్థ్యం ఇలా.. లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ ఫోన్ మన దేశంలో 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఆక్టా కోర్ చిప్ సెట్ ను కలిగి ఉంది. 5జీబీ వరకూ ర్యామ్ ని వర్చువల్ గా పెంచుకోవచ్చు. 1టీబీ వరకూ ఎక్స్ టర్నల్ మెమరీ సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకొనే వెసులుబాటు ఉంది.

స్క్రీన్ అండ్ డిస్ ప్లే.. లావా కొత్త 5జీ ఫోన్ లో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, 1600*720 పిక్సల్స్ హెడ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది. 90Hzరిఫ్రెష్ మెంట్ రేట్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వద్ద వాటర్ ట్రాప్ నాట్చ్ ఉంటుంది. ఇది వైడ్ వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

కెమెరా సెటప్.. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు 2ఎంపీ మైక్రో సెన్సార్, వీజీఏ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది.

ఫీచర్లు.. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15వాట్స్ సామర్థ్యంతో ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూ టూత్ 5.1, జీపీఎస్ ఉంటుంది. యూఎస్బీ టైప్ సీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది.

ధర, లభ్యత.. ఇది రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్లలో ఫోన్ లభిస్తోంది. 6జీబీ వేరియంట్ ధర రూ.12,000 గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..