Fog: ఉదయాన్నే పొగమంచు ఎందుకు ఏర్పడుతుంది.. అలా ఏర్పడేందుకు గల కారణాలు ఏమిటి.?

Fog: చలికాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు సమస్య కూడా పెరుగుతుంది. పొగమంచు కారణంగా, హైవేపై వాహనాల వేగం తగ్గుతుంది. అలాగే రైళ్లు, విమానాలకు కూడా..

Fog: ఉదయాన్నే పొగమంచు ఎందుకు ఏర్పడుతుంది.. అలా ఏర్పడేందుకు గల కారణాలు ఏమిటి.?
Follow us

|

Updated on: Nov 24, 2021 | 10:14 AM

Fog: చలికాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు సమస్య కూడా పెరుగుతుంది. పొగమంచు కారణంగా, హైవేపై వాహనాల వేగం తగ్గుతుంది. అలాగే రైళ్లు, విమానాలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తాయి. అయితే ఇలా పొగమంచు అనేది ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది.  పొగమంచు ప్రభావం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతుంది. ఈ పొగమంచు ఉదయం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ఎందుకు ఉంటుంది.. శీతాకాలంలో పొగమంచు కమ్ముకోవడం ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇలాంటి పరిస్థితిలో పొగమంచుకు సంబంధించిన ప్రత్యేక విషయాలను తెలుసుకోండి.

పొగమంచు అనేది ఒక రకమైన నీటి ఆవిరి. పొగమంచు సాధారణంగా చలికాలంలో ఏర్పడుతుంది. రాత్రి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండే రోజుల్లో ఈ పరిస్థితిని ఎక్కువగా గమనించవచ్చు. గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీనినే తేమ లేదా ఆర్ద్రత అంటారు. ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం, ఉష్ణోగ్రతలను బట్టి ఉంటుంది. గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గాలిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయిందనుకుందాం. అంతవరకూ గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మబిందువుల రూపంలో ఘనీభవిస్తుంది. అదే పొగమంచు. ఈ సూక్ష్మబిందువులపై పడే కాంతి వివర్తనం (scattering) చెంది అన్ని వైపులకు ప్రసరిస్తుంది. అందువల్ల అన్నీ కలిసి పొగలాగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా చలికాలంలో ఉంటుంది.

పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి?

చలికాలంలో రాత్రివేళల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటియావిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము.

చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల నీటియావిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను, చెట్ల ఆకులను పూలను, పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటియావిరి ఘనీభవిస్తుంది. అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు. వర్షపు బిందువులలాగా మంచు బిందువులు ఆకాశం నుంచి కురవవు. అయితే గాలిలోని నీటి ఆవిరి మొత్తాన్ని తేమ అంటారు. నీటి బిందువులు ఘనీభవించడం లేదా వాయువు నుండి ద్రవంగా మారడం ప్రారంభిస్తాయి. ఇది దట్టమైన పొగమంచులా కనిపిస్తుంది. దీనిని పొగమంచు అంటారు.

పొగమంచు ఎలా ఏర్పడుతుంది:

గాలి ఉష్ణోగ్రత, మంచు బిందువు మధ్య వ్యత్యాసం 2.5 °C (4.5 °F) కంటే తక్కువగా ఉన్నప్పుడు పొగమంచు ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్న గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. దానిని మనం తేమ అని పిలుస్తాము. శీతాకాలంలో భూమి యొక్క ఉపరితలం దగ్గర ఉన్న వెచ్చని గాలిలో ఉన్న నీటి ఆవిరి పైన ఉన్న చల్లని గాలి పొరలతో కలపడం ద్వారా ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియను సంక్షేపణం అంటారు. చుట్టుపక్కల చల్లటి గాలిని తాకినప్పుడు, దాని రూపం పొగ మేఘంలా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి

GoDaddy Hacked: ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గో డాడీ హ్యాక్.. ప్రమాదంలో12 లక్షల మంది డేటా..!