Soundcore: సౌండ్‌కోర్ నుంచి అదిరిపోయే హెడ్‌ఫోన్స్.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 60 గంటల బ్యాకప్.. ధర, ఫీచర్స్ వివరాలు..!
Soundcore: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త మొబైళ్లు, హెడ్‌ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆడియో టెక్నాలజీలో పేరుగాంచిన..
Soundcore: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త మొబైళ్లు, హెడ్‌ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆడియో టెక్నాలజీలో పేరుగాంచిన సౌండ్‌కోర్ ఇండియా మార్కెట్లోకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్‌తో రెండు వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఈ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. లైఫ్ క్యూ30, లైఫ్ క్యూ35 పేరుతో సౌండ్‌కోర్ ఈ హెడ్‌ఫోన్స్ మార్కెట్లో విడుదలయ్యాయి. ఇక లైఫ్ క్యూ30 ధర రూ.7,999 ఉండగా, లైఫ్ క్యూ34 ధర 9,999 ఉంది. ఈ హెడ్‌ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచింది కంపెనీ.
ఈ హెడ్‌ఫోన్స్ బ్లాక్, రెండు కలర్స్‌లో ఉన్నాయి. లైఫ్ క్యూ30 బ్లాక్ కలర్, లైఫ్ క్యూ35 గులాబీ కలర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 60 గంటల పాటు బ్యాటరీ సదుపాయం ఉంటుంది. కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో నాలుగు గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ సదుపాయం, మెమొరీ ఫోమ్ ఇయర్ కప్స్, బ్లూటూత్ సపోర్టుతో పాటు 18 నెలల వారంటీ సదుపాయం కూడా అందిస్తోంది కంపెనీ.
ఇవి కూడా చదవండి: