Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OPPO EV: ఒప్పో నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కార్లు.. భారత్‌లో ఈవీలను తీసుకురానున్న మొబైల్ కంపెనీలు!

స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలతో ఆటోమోటివ్ రంగంలోకి ప్రవేశించేందుకు వేగంగా ప్లాన్ చేస్తున్నాయి. మొబైల్ మేకర్ ఒప్పో త్వరలో భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్లు సమాచారం.

OPPO EV: ఒప్పో నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కార్లు.. భారత్‌లో ఈవీలను తీసుకురానున్న మొబైల్ కంపెనీలు!
Oppo Evs
Follow us
KVD Varma

|

Updated on: Nov 24, 2021 | 5:35 PM

OPPO EV: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలతో ఆటోమోటివ్ రంగంలోకి ప్రవేశించేందుకు వేగంగా ప్లాన్ చేస్తున్నాయి. మొబైల్ మేకర్ ఒప్పో త్వరలో భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశానికి తీసుకురావడానికి కంపెనీ కృషి చేస్తోందని.. దాని కోసం ఇప్పటికే ప్రణాళికలో ఉందని కంపెనీ నుంచి వచ్చిన కొత్త నివేదిక పేర్కొంది. కంపెనీ భారతదేశం కోసం ఒక ఎలక్ట్రిక్ కారుపై కసరత్తు చేస్తోంది, దీనిని 2024లో విడుదల చేయవచ్చు.

మీడియా నివేదికల ఆధారంగా అందిన సమాచారం ప్రకారం, ఒప్పో(Oppo), రియల్ మే(Realme), వన్ ప్లస్(OnePlus) వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ప్రస్తుతం భారతదేశానికి ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి.. తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాయి. మొదటి ఎలక్ట్రిక్ కారు ఒప్పో(Oppo) నుంచి కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 2024 ప్రారంభంలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ బ్రాండ్‌లు తమ ఎలక్ట్రానిక్ వాహనాలు(EV)లు లేదా అలాంటి పరికరాల రూపకల్పనకు సంబంధించిన ప్లాన్‌ల వివరాలను ఇంకా నిర్ధారించలేదు.

యాపిల్ డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ కారు

యాపిల్ తన ప్రాజెక్ట్ టైటాన్ కింద దీర్ఘకాల భవిష్యత్ కారు ఆపిల్ డ్రైవర్‌లెస్ కార్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. డ్రైవర్‌లెస్ కారు పూర్తిగా సెన్సార్ ఆధారితంగా ఉంటుంది. అందులో కూర్చున్న వ్యక్తులు తమ స్మార్ట్ పరికరం నుండి కారును నియంత్రించగలుగుతారు. ఇందులో, కారును కుడి లేదా ఎడమవైపు తిప్పడానికి స్టీరింగ్ అవసరం ఉండదు.

700 కి.మీల రేంజ్‌ను అందించే హువాయి(Huawei) ఎలక్ట్రిక్ కారు

హువాయి కూడా ఈ నెలలో అవతార్ 11(Avatar 11) అనే ఎలక్ట్రిక్ కారుకు తెర తీసింది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 700 కి.మీ. ఇది 200 kWh హై-వోల్టేజ్ సూపర్ ఛార్జింగ్ బ్యాటరీని కలిగి ఉంది. అదే సమయంలో, 400 రకాల ఇంటెలిజెంట్ డ్రైవింగ్ ఫీచర్లు ఇందులో ఇచ్చారు. ఈ కారు గొప్పదనం దాని పికప్. ఇది కేవలం 4 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు విడుదల 2022 రెండవ త్రైమాసికంలో ఉంటుంది.

జియోమి(Xiaomi) ఎలక్ట్రిక్ కారు 2024లో

జియోమీ ఎలక్ట్రిక్ కారు వస్తుందని ఆ కంపెనీ సిఈవో లీ జున్ అక్టోబర్ లో ప్రకటించారు. జియోమీ ఎలక్ట్రిక్ కార్లను 2024 ప్రథమార్ధంలో భారీగా ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి: Hira Horse: వామ్మో.. ఈ ఖరీదైన గుర్రం ఎన్ని లీటర్ల పాలు తాగుతుందో తెలిస్తే గుండెలదిరిపోతాయి!

Agriculture laws: వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఎలా ఉపసంహరించుకుంటుంది.. ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి కావచ్చు? తెలుసుకోండి!

Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నివారణకు ముందస్తుగానే కృషి చేయాల్సి ఉంది.. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోండి..సుప్రీం కోర్టు