Hira Horse: వామ్మో.. ఈ ఖరీదైన గుర్రం ఎన్ని లీటర్ల పాలు తాగుతుందో తెలిస్తే గుండెలదిరిపోతాయి!

గుర్రం అంటే మనం చాలా మామూలుగా తీసుకుంటాం. పందేల్లో వాడే గుర్రాలు మహా అయితే లక్షల ఖరీదు చేస్తాయని భావిస్తాం. పైగా దానికి ఇంత గడ్డి.. అంత దాణా పెట్టేస్తే సరిపోతుందని అంచనా వేస్తాం.

Hira Horse: వామ్మో.. ఈ ఖరీదైన గుర్రం ఎన్ని లీటర్ల పాలు తాగుతుందో తెలిస్తే గుండెలదిరిపోతాయి!
Hira Horse

Hira Horse: గుర్రం అంటే మనం చాలా మామూలుగా తీసుకుంటాం. పందేల్లో వాడే గుర్రాలు మహా అయితే లక్షల ఖరీదు చేస్తాయని భావిస్తాం. పైగా దానికి ఇంత గడ్డి.. అంత దాణా పెట్టేస్తే సరిపోతుందని అంచనా వేస్తాం. కానీ, ఇప్పుడు మీకు చెప్పబోయే గుర్రం విశేషాలు వింటే మీరు గుండెల మీద చేతులు వేసుకుని అమ్మో అనుకోవడం ఖాయం. ఎందుకంటే.. ఈ గుర్రం గడ్డి కంటే ఎక్కువగా పాలు గటగటా తాగేస్తుంది. ఇక దీని ఖరీదు వింటే గుండె ఆగిపోతుంది. ఆ గుర్రం కథా కమామీషు తెలుసుకుందాం రండి.

రాజస్థాన్ రాష్ట్రం శ్రీగంగానగర్‌లో జరుగుతున్న గుర్రాల జాతరలో కనిపించింది ఈ గుర్రం. దీని పేరు హీరా అంటే తెలుగులో వజ్రం. దీనిని పదంపూర్ కు చెందిన ఇక్బాల్ సింగ్ 9 సంవత్సరాలుగా పెంచుతున్నారు. ఈ గుర్రం ఒకేసారి ఒకేసారి 50 లీటర్ల పాలు తాగుతుంది. అంటే, దీనికి ఒకరోజు పాల ఖర్చే తక్కువలో తక్కువ వెయ్యిరూపాయల మాటే! దీని పాల ఖర్చే ఇంత ఉంటే.. ఈ గుర్రం ఖరీదు ఎంత ఉండాలి చెప్పండి. కొద్దిగా ఊహించడం కష్టమే అనిపిస్తోందా. ఈక్విజ్ ప్రశ్నలు ఆపేసి అసలు రేటు చెప్పేస్తున్నాం.. అక్షరాల రెండున్నర కోట్ల రూపాయలు. అవును మీరు విన్నది నిజమే. దీని ఖరీదు కోట్లలోనే! ఇప్పుడు ఈ జాతరలో హాట్ టాపిక్ ఈ వజ్రమే! అదేనండీ హీరా హార్స్!

ఇక ఈ జాతరకు వచ్చిన గుర్రాలన్నింటిలోకెల్లా హీరాదే అత్యంత ఎత్తు అని దాని యజమాని ఇక్బాల్ సింగ్ చెబుతున్నాడు. సాధారణంగా గుర్రం ఎత్తు 160 సెం.మీ ఉంటుంది. కానీ, ఈ డైమండ్ హార్స్ ఎత్తు 170 సెం.మీ.కి దగ్గరగా ఉంటుంది. ఈ డైమండ్ ఆహారం.. సంరక్షణ కోసం ప్రతి నెలా ఒకటిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. దీనికి వారానికి రెండుసార్లు నెయ్యి, పాలు ఇస్తారు.

ఆహారంలో పాలతో పాటు, శనగలు..వేరుశెనగ కూడా

హీరా మార్వాడీ జాతికి చెందిన గుర్రం అని ఇక్బాల్ సింగ్ చెప్పారు. దాని కాళ్లు బలంగా ఉంటాయి. ఆహారంలో శెనగ, బార్లీ, పాలు, వేరుశనగ, నీర ఇస్తారు. వేసవిలో ఆవనూనె, చలికాలంలో నువ్వులనూనె దీనికి ఇస్తారు. దీని వల్ల దాని జీర్ణశక్తి బాగానే ఉంటుంది. పేగులు మృదువుగా ఉంటాయి. అదేవిధంగా గుర్రం చర్మం మెరుస్తుంది అని ఆయన వివరించారు.

ఇక్బాల్‌కి గుర్రాలంటే చాలా ఇష్టం..

ఇక్బాల్ సింగ్ కాటన్ ఫ్యాక్టరీ యజమాని.. వ్యవసాయం కూడా చేస్తుంటాడు. తొమ్మిదేళ్ల క్రితం అతను హీరాను పెంచుకోవడానికి తెచ్చుకున్నాడు. మూడున్నరేళ్ల నుంచి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏడేళ్ల వరకు రోజూ 50 లీటర్ల పాలు తాగించే వారు. దీని తరువాత, హీరాకు వారానికి రెండుసార్లు 50-50 లీటర్ల పాలు ఇస్తున్నారు. దీని ఎత్తు చూసి రాజస్థాన్, యూపీకి చెందిన గుర్రపు ప్రేమికులు 2.5 కోట్ల రూపాయలను ఆఫర్ చేశారు. ఈ జాతికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. దాని పిల్లలు కూడా అధిక ఎత్తులో ఉంటాయి.

ఈ గుర్రమూ ఖరీదైనదే!

ఇదే అంటే దీని తరువాత కోట్ల ఖరీదు చేసే ఇంకో గుర్రం కూడా ఈ జాతరలో కనిపించింది. దాని రేటు 1.25 కోట్ల రూపాయలు. ఈ గుర్రం పేరు ‘రాజ్ దిలావర్’. ఈ గుర్రం యజమాని లాల్‌రాజ్ సింగ్ తన గుర్రం రత్నాకర్ బ్లర్ లైన్ జాతికి చెందినదని చెప్పాడు. అతను దాని ధరను గురించి చెబుతూ.. దానికి ఇప్పటివరకూ 70 లక్షల ఆఫర్‌ వచ్చిందాని చెప్పాడు. అయితే, 1.25 కోట్లు వస్తే దాన్ని అమ్మేస్తామన్నాడు. ఈ గుర్రానికి 30-35 మంది పిల్లలు ఉన్నారని శ్రీగంగానగర్‌లోని శ్రీనగర్ ప్రాంతానికి చెందిన లాల్‌రాజ్ సింగ్ చెప్పారు. అన్నీ 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు అమ్ముడయ్యాయి. గుర్రానికి పప్పు, బార్లీ, నెయ్యి ఇస్తారని అతను చెప్పాడు.

ఇవి కూడా చదవండి: Andhra Pradesh: ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు

ISIS Magazine: ISIS ఆన్‌లైన్ మ్యాగజైన్‌ పోస్టర్ వివాదం.. భద్రతా పెంచిన కన్నడ ప్రభుత్వం

Click on your DTH Provider to Add TV9 Telugu