INS Vela: భారత నేవీలోకి నిశ్శబ్ద ఆయుధం ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి.. మెరుపుదాడితో శత్రువుల పని పట్టేస్తుంది!
స్కార్పెన్ తరగతికి చెందిన నాల్గవ జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలా(INS Vela). దాదాపు 11 నెలల వివిధ ట్రయల్స్ తర్వాత నేవీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.

INS Vela: స్కార్పెన్ తరగతికి చెందిన నాల్గవ జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలా(INS Vela). దాదాపు 11 నెలల వివిధ ట్రయల్స్ తర్వాత నేవీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 67.5 మీటర్ల పొడవు – 12.3 మీటర్ల ఎత్తు ఉన్న ఈ జలాంతర్గామి 300-400 మీటర్ల వరకు సముద్రపు లోతులలో డైవింగ్ చేయగలదు. ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిలోని భాగాలు, పరికరాలు చాలా తక్కువ శబ్దం చేస్తాయి కాబట్టి శత్రువును చాలా నిశ్శబ్దంగా వేటాడగల సామర్థ్యం దీనికి ఉంది.
దీని పరికరాలన్నీ దేశంలోనే తయారయ్యాయి..
సబ్‌మెరైన్‌కు చెందిన కెప్టెన్ అనీష్ మాథ్యూ మీడియాతో మాట్లాడుతూ, “ఐఎన్‌ఎస్ వేలాలోని ప్రధాన బ్యాటరీ పూర్తిగా దేశీయంగా నిర్మించారు. ఇది కాకుండా, ఇందులో ఉపయోగించే చాలా పరికరాలు దేశంలోనే తయారు చేశారు.” అని చెప్పారు.
బ్యాటరీతో నడుస్తుంది..
ఇది సంప్రదాయ జలాంతర్గామి కావడంతో బ్యాటరీ, డీజిల్ మోడ్‌లో నడుస్తుందని మాథ్యూ చెప్పారు. ఈ జలాంతర్గామి ప్రధానంగా డీజిల్‌తో బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. తర్వాత జలాంతర్గామి బ్యాటరీ ద్వారా నడుస్తుంది. దాని స్టెల్త్ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. ఐఎన్ఎస్ వేలాలో 10 మంది అధికారులు, 35 మంది సెయిలర్లు ఉంటారు. ఈ జలాంతర్గామి దాదాపు 45 రోజుల పాటు సముద్రపు లోతుల్లో ఉండగలదని చెబుతున్నారు.
విశేషమేమిటంటే, ఐఎన్ఎస్ వేలా(INS Vela) 6 మే 2019న ప్రారంభించారు. ఈ జలాంతర్గామి మొదటిసారిగా 17 ఫిబ్రవరి 2020న సముద్ర పరీక్షలను ఎదుర్కొంది. దీనిని ముందుగా ఈ సంవత్సరం 9 డిసెంబర్ 2021న అందజేయాలని నిర్ణయించారు, కానీ ఇప్పుడు అది సమయానికి ముందే ప్రారంభించడానికి సిద్ధం అయిపొయింది. ఇది నవంబర్ 25న ప్రారంభం అవుతుంది.
ఐఎన్ఎస్ వేలా మెరుపుదాడిలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రాన్స్ సహాయంతో, ఈ జలాంతర్గామిని ముంబైలోని ఎండీఎల్(MDL) వద్ద నిర్మించారు. దాని సోనార్ అత్యాధునికమైనందున, ఇది చిన్న కదలికలను కూడా సంగ్రహిస్తుంది. ఈ జలాంతర్గామిని సముద్రం లోపల దాక్కుని, మెరుపుదాడి చేసి శత్రువులపై దాడి చేసి నాశనం చేసే విధంగా రూపొందిందని నిపుణులు అంటున్నారు.
ఈ జలాంతర్గామిలో ఇది ప్రత్యేకం..
మొదట ఐఎన్ఎస్ కల్వరి తర్వాత జలాంతర్గామి ఖండేరి, జలాంతర్గామి కరంజ్ నౌకాదళంలో చేరగా, నాలుగో సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ వెలా చేరబోతోంది. ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్‌లో అత్యాధునిక స్టెల్త్ ఫ్యూచరిస్టిక్ వెపన్ సిస్టమ్‌లు, అధునాతన సోనార్, రాడార్, ఎలక్ట్రానిక్ నిఘా సెన్సార్లు.. శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఈ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన ఆరు జలాంతర్గాములలో నాల్గవది.
ఇవి కూడా చదవండి: Hira Horse: వామ్మో.. ఈ ఖరీదైన గుర్రం ఎన్ని లీటర్ల పాలు తాగుతుందో తెలిస్తే గుండెలదిరిపోతాయి!