GoDaddy Hacked: ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గో డాడీ హ్యాక్.. ప్రమాదంలో12 లక్షల మంది డేటా..!

GoDaddy Hacked: అతిపెద్ద డొమైనో రిజిస్టార్‌లలో ఒకటైన గోడాడీ.డాట్ కామ్ (godaddy.com) హ్యాక్‌కు గురైంది. దీని కారణంగా 12 లక్షల వర్డ్‌ప్రెస్‌ వినియోగదారుల డేటా ..

GoDaddy Hacked: ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గో డాడీ హ్యాక్.. ప్రమాదంలో12 లక్షల మంది డేటా..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 23, 2021 | 12:16 PM

GoDaddy Hacked: ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గోడాడీ. కామ్(GoDaddy.com) హ్యాక్ అయినట్లు సమాచారం. దాదాపు 12 లక్షల మంది వర్డ్ ప్రెస్ యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని అంటున్నారు. US సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ద్వారా ఈ సమస్య కనుగొనబడింది. వెంటనే ఐటీ ఫోరెన్సిక్స్ సంస్థ సహాయంతో విచారణ ప్రారంభింది గోడాడీ. అయితే గో డాడీ అనేది ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ డొమైన్ సర్వీస్. గో డాడీ అనేది ఒక అమెరికన్ పబ్లిక్‌గా వ్యాపారం చేసే ఇంటర్నెట్ డొమైన్ రిజిస్ట్రార్ మరియు వెబ్ హోస్టింగ్ కంపెనీ. ఇది 17 మిలియన్ల కస్టమర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద డొమైన్. పరిపాలనలో 71 మిలియన్ డొమైన్‌లు ఉన్నాయి. వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడానికి ఇది వెబ్ హోస్టింగ్ సేవకు ఉపయోగపడుతుంది.  దీని కారణంగా 12 లక్షల వర్డ్‌ప్రెస్‌ (WordPress) వినియోగదారుల డేటా లీకయ్యే ప్రమాదంలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే వర్డ్‌ ప్రెస్‌ హోస్టింగ్‌ ఎన్విరాల్‌మెంట్‌కు అనధికారిక థర్డ్‌ పార్టీ యాక్సెస్‌ కనుగొన్నట్లు యూఎస్‌ సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు వెల్లడించిన వివరాల్లో పేర్కొంది. పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వర్డ్‌ ప్రెస్‌ కోసం మా లెగసీ కోడ్‌బెస్‌లో ప్రొవిజనింగ్‌ సిస్టమ్‌ను యాక్సెస్‌ చేసినట్లు తెలిపింది.

అయితే GoDaddy హ్యాక్‌ అయినప్పటికీ డేటాను సద్వినియోగం చేసుకున్నట్లు ఎటువంటి నివేదికలు లేనప్పటికీ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సెస్టెంబర్‌ 6 నాటికి GoDaddy సిస్టమ్‌లకు యాక్సెస్‌ పొందడానికి పాస్‌వర్డ్‌ను ఉపయోగించారని తెలిపింది. గత వారం నవంబర్‌ 17న హ్యాక్‌ జరిగినట్లు గుర్తించామని తెలపింది.

ఇవి కూడా చదవండి:

Octopus: అక్టోపస్‌ జీవి గురించి తెలుసా..? అన్ని ప్రత్యేకతలే.. దీనికి 9 మెదడులు.. 3 హృదయాలు.. ఇంకా మరెన్నో..!

Whatsapp Chats: మీ వాట్సాప్‌ నుంచి డేటా డిలీట్‌ అయ్యిందా..? టెన్షన్‌ లేదు.. ఇలా బ్యాకప్‌ చేయండి..!

Flight Light: విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఫ్లైట్‌ లైట్లు ఎందుకు డిమ్‌ అవుతాయో తెలుసా..?