All Electric Aircraft: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానం చూశారా? ఎంత స్పీడ్‌తో ప్రయాణించిందో తెలిస్తే షాకే..!

ఈ విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో 555.9 kmph వేగంతో ఎగిరి సరికొత్త రికార్డు సృష్టించింది. అదే సమయంలో రికార్డ్ బ్రేకింగ్ రన్ సమయంలో విమానం గరిష్టంగా 623 kmph వేగాన్ని అందుకోవడం విశేషం.

All Electric Aircraft: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానం చూశారా? ఎంత స్పీడ్‌తో ప్రయాణించిందో తెలిస్తే షాకే..!
Electric Aircraft
Follow us

|

Updated on: Nov 23, 2021 | 12:12 PM

All Electric Aircraft: మీరు ఎలక్ట్రిక్ కార్లు లేదా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురించి విన్నారు. అలాగే వాటిని చూశారు. అయితే ప్రస్తుతం రాబోతున్న ఎలక్ట్రిక్ విమానాల గురించి విన్నారా? ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తాకిడితో కొత్తగా విమానాలు కూడా చేరనున్నాయి. ఇప్పటికే ఓ విమానం కూడా సిద్ధమైంది. ఆ విమానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారుచేసింది.

మీడియా నివేదికల ప్రకారం, ఈ విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో 555.9 kmph వేగంతో ఎగిరి సరికొత్త రికార్డు సృష్టించింది. అదే సమయంలో రికార్డ్ బ్రేకింగ్ రన్ సమయంలో విమానం గరిష్టంగా 623 kmph వేగాన్ని అందుకోవడం విశేషం. ఈ విమానం 15 నిమిషాల పాటు ఆకాశంలో విహరించింది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ అని పేరు పెట్టారు. ఇది 2017లో 213.04 km/h వేగంతో 330 LE ఏరోబాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ మునుపటి రికార్డును బద్దలు కొట్టింది.

ఒక నిమిషంలో.. 3,000 మీటర్ల ఎత్తును దాటింది. అత్యంత వేగంగా 3,000 మీటర్ల ఎత్తును దాటడానికి కేవలం 60 సెకన్లు మాత్రమే పట్టింది. దీంతో పాటు 202 సెకన్లలో మరింత ఎత్తుకు చేరుకున్న రికార్డును కూడా బద్దలు కొట్టింది.

సింగిల్ సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్.. ఇన్నోవేషన్ సింగిల్ సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు స్ఫూర్తినిస్తుంది. ఇప్పటి వరకు ఏ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పోల్చినా అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ని అందించినట్లు కంపెనీ తెలిపింది. విమానం 6000 సెల్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. దానిలోని ఎలక్ట్రిక్ మోటారు సుమారు 500 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విమానం గంటకు 300 మైళ్ల (గంటకు దాదాపు 483 కిలోమీటర్లు) గరిష్ట వేగంతో ప్రయాణించగలదని రోల్స్ రాయిస్ తెలిపింది.

ఎయిర్ టాక్సీని అభివృద్ధి చేసేందుకు.. ఎయిర్ టాక్సీని అభివృద్ధి చేసేందుకు టెక్నామ్ కంపెనీతో రోల్స్ రాయిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. రోల్స్ రాయిస్ (Rolls-Royce), ఎయిర్‌ఫ్రామెర్ టెక్నాం (airframer Tecnum) ప్రస్తుతం స్కాండినేవియాలో అతిపెద్ద స్థానిక విమానయాన సంస్థలుగా ఉన్నాయి. మార్కెట్‌లో అన్ని-ఎలక్ట్రిక్ విమానాలను పంపిణీ చేయడానికి Wideroeతో కలిసి పనిచేస్తున్నాయి. ఇది 2026లో ఎయిర్ టాక్సీలకుగా సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Also Read: GoDaddy Hacked: గోడాడీ హ్యాక్‌.. ప్రమాదంలో 12 లక్షల వర్డ్‌ప్రెస్‌ వినియోగదారుల డేటా..!

Ikoma: ఈ ఫోటోలో కనిపిస్తోంది ఏంటో చెప్పుకోండి.. 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే..