Jio Recharge Plans: తక్కువ ధరలోనే జియో నయా రీచార్జ్ ప్లాన్స్.. ఎయిర్‌టెల్, వీఐకు గట్టి పోటీ

పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం ధరలను కూడా జియో పెంచింది. అయితే టెలికాం మార్కెట్‌లో మాత్రం జియో ఏది చేస్తే మిగిలిన కంపెనీలు అదే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జియో ఇటీవల తన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. జియోతో పాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమ టారిఫ్‌లను పెంచాయి. అయితే ఈ రెండు కంపెనీలతో పోలిస్తే జియో ఇప్పటికీ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుందని చాలా మందికి తెలియదు.

Jio Recharge Plans: తక్కువ ధరలోనే జియో నయా రీచార్జ్ ప్లాన్స్.. ఎయిర్‌టెల్, వీఐకు గట్టి పోటీ
Jio
Follow us

|

Updated on: Aug 01, 2024 | 3:11 PM

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను ఈ స్థాయిలో ఉందంటే జియో ప్రధాన కారణమని కొంతమంది మార్కెట్ నిపుణులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా డేటా చార్జీలు గతంలో చాలా ఎక్కువ ఉండేవి. ఆ సమయంలో అందరికీ అందుబాటు ధరల్లో జియో సేవలను అందించడంతో చాలా మంది వినియోగదారులు జియో సిమ్‌లు తీసుకున్నారు. అయితే క్రమేపి పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం ధరలను కూడా జియో పెంచింది. అయితే టెలికాం మార్కెట్‌లో మాత్రం జియో ఏది చేస్తే మిగిలిన కంపెనీలు అదే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జియో ఇటీవల తన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. జియోతో పాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమ టారిఫ్‌లను పెంచాయి. అయితే ఈ రెండు కంపెనీలతో పోలిస్తే జియో ఇప్పటికీ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుందని చాలా మందికి తెలియదు. రూ.250 కంటే తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు డేటా ప్రయోజనాలను అందించే జియో ప్లాన్స్ గురించి ఓ సారి తెలుసుకుందాం. 

రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచిత రోమింగ్, రోజుకు 1జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజుల పాటు ఉంటుంది. అంటే ఈ ప్లాన్ ద్వారా మొత్తం 22GB డేటాను పొందవచ్చు. అదనంగా వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో ఫైల్ యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. 

రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్

రూ. 249 ప్లాన్ ద్వారా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచిత రోమింగ్, రోజుకు 1 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం 28 రోజులు అంటే వినియోగదారులకు 28 జీబీ డేటా వస్తుంది. అలాగే ఈ ప్లాన్‌లో కూడా వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాప్ సబ్‌స్క్రిప్షన్లను కాంప్లిమెంటరీగా పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

తక్కువ ధరలోనే జియో నయా రీచార్జ్ ప్లాన్స్.. ఎయిర్‌టెల్, వీఐకు పోటీ
తక్కువ ధరలోనే జియో నయా రీచార్జ్ ప్లాన్స్.. ఎయిర్‌టెల్, వీఐకు పోటీ
తెలంగాణలో ఇంజినీరింగ్‌ B-కేటగిరీ సీట్లభర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణలో ఇంజినీరింగ్‌ B-కేటగిరీ సీట్లభర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
ఒలింపిక్స్ లో కాంస్యం.. షూటర్ స్వప్నిల్‌కు ప్రధాని మోడీ అభినందనలు
ఒలింపిక్స్ లో కాంస్యం.. షూటర్ స్వప్నిల్‌కు ప్రధాని మోడీ అభినందనలు
అప్పుడు అవకాశం ఇస్తే నో చెప్పాడు.. ఇప్పుడు..
అప్పుడు అవకాశం ఇస్తే నో చెప్పాడు.. ఇప్పుడు..
జూలై ఒక్క నెలలో UPI లావాదేవీలు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
జూలై ఒక్క నెలలో UPI లావాదేవీలు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
వార్నీ.. గుడ్డిగా టమాటాలు కోస్తే గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్‌..!?
వార్నీ.. గుడ్డిగా టమాటాలు కోస్తే గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్‌..!?
'కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ కోటా పునరుద్ధరణ యోచన లేదు'
'కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ కోటా పునరుద్ధరణ యోచన లేదు'
'నేనైతే ఆ షాట్ తప్పనే వాడిని'.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్
'నేనైతే ఆ షాట్ తప్పనే వాడిని'.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యాన్ని ముద్దాడిన స్వప్నిల్
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యాన్ని ముద్దాడిన స్వప్నిల్
సంతోషంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటించండి..
సంతోషంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటించండి..