AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno CAMON 30S Pro: చూడగానే అట్రాక్ట్‌ చేస్తున్న కొత్త ఫోన్‌..టెక్నో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌

టెక్నో కెమాన్‌ 30ఎస్‌ ప్రో పేరుతో ఈ ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. విడుదల తేదీకి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. అయితే వచ్చే నెలలో ఈ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన డిజైన్‌, ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది...

Tecno CAMON 30S Pro: చూడగానే అట్రాక్ట్‌ చేస్తున్న కొత్త ఫోన్‌..టెక్నో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌
Tecno Camon 30s Pro
Narender Vaitla
|

Updated on: Aug 01, 2024 | 9:39 AM

Share

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో ఇటీవల భారత మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌ సెగ్మెంట్‌లో పలు ఆసక్తికరమైన ఫోన్‌లను లాంచ్‌ చేసిన టెక్నో తాజాగా మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్‌ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రీమియం లుక్స్‌తో తక్కువ బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. టెక్నోకెమాన్‌ 30ఎస్ ప్రో పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టెక్నో కెమాన్‌ 30ఎస్‌ ప్రో పేరుతో ఈ ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. విడుదల తేదీకి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. అయితే వచ్చే నెలలో ఈ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన డిజైన్‌, ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. తక్కువ ధరలోనే కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను తీసుకొస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. హీలియో జీ100 ఆక్టాకోరా ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. అలాగే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ స్క్రీన్‌ 1080*2436 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. వీటిలో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ IMX896 ప్రధాన సెన్సార్ OISతో పాటు, 2 ఎంపీతో కూడిన మరో కెమెాను అందించనున్నారు అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్సతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. 45 నిమిషాల్లో ఫోన్‌ బ్యాటరీ ఫుల్‌ అవుతుందని కంపెనీ చెబతోంది. అలాగే ఈ ఫోన్‌లో డాల్బీ అట్మాస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లను అందించనున్నారు. ఈ ఫోన్‌లో ఐపీ53 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇచ్చారు. ధరకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్‌ మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..