Amazon: అసలైన ఆఫర్ల పండగా వచ్చేస్తోంది.. ఊహకందని డిస్కౌంట్స్‌..

అయితే అమెజాన్‌ ఇప్పటి వరకు డీల్స్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. అయితే తాజాగా కొన్ని డీల్స్‌కు సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి ఆఫర్లు లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అమెజాన్‌ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌, స్మార్ట్‌ టీవీలపై ఏకంగా 80 శాతం వరకు..

Amazon: అసలైన ఆఫర్ల పండగా వచ్చేస్తోంది.. ఊహకందని డిస్కౌంట్స్‌..
Amazon Sale
Follow us

|

Updated on: Aug 01, 2024 | 1:11 PM

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రతీ ఏటా గ్రేట్ ఫ్రీడమ్‌ సేల్‌ నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెజాన్‌ ఈ సేల్‌ను నిర్వహిస్తుంది. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అమెజాన్‌ ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టు 6వ తేదీ నుంచి అమెజాన్‌లో సేల్ ప్రారంభంకాబోతోంది. అమేజాన్‌ గ్రేట్ ఫ్రీడమ్‌ సేల్ పేరుతో నిర్వహించిన ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో పాటు, గృహోపకరణ వస్తువులపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు.

అయితే అమెజాన్‌ ఇప్పటి వరకు డీల్స్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. అయితే తాజాగా కొన్ని డీల్స్‌కు సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి ఆఫర్లు లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అమెజాన్‌ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌, స్మార్ట్‌ టీవీలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక బెస్ట్ టైమ్‌గా చెప్పొచ్చు.

కాగా ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై కూడా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 లైట్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 4, వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4, వన్‌ప్లస్ ఓపెన్‌, వన్‌ప్లస్ 12ఆర్‌, వన్‌ప్లస్‌ 12పై తగ్గింపు ధరలకు అందిస్తోంది. అలాగే సేల్‌లో భాగంగా ఐక్యూ, రెడ్‌మీ, పోకో, టెక్నో, సామ్‌సంగ్ వంటి స్మార్ట్‌ ఫోన్స్‌పై కూడా డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ముఖ్యంగా ఐక్యూ జెడ్‌9 లైట్‌, ఐక్యూ 12, ఐక్యూ నియో 9 ప్రో, ఐక్యూ జెడ్‌7 ప్రో, ఐక్యూ జెడ్‌9, ఐక్యూ జెడ్‌9ఎక్స్‌, రెడ్‌మీ13, రెడ్‌మీ 12, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌, షావోమీ 14 వంటి ఫోన్‌లపై ఏకంగా 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ అందించనున్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటు పలు కూపన్ల ద్వారా కొన్ని ఫోన్‌లపై రూ. 10 వేరకు స్పెషల్ డిస్కౌంట్‌ అందించనున్నారు. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ సైతం అందిస్తున్నారు. గృహోపకరణాలపై 65 శాతం వరకూ తగ్గింపు లభిస్తోంది. వీటితో పాటు స్మార్ట్ ఫోన్ యాక్సెసరీలపై 40 శాతం వరకూ, స్మార్ట్ టీవీలు, కిచెన్ ఉపకరణాలపై 65 శాతం వరకూ తగ్గింపు లభించనుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..