AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: దారుణం.. ఫుడ్‌డెలివరీ బాయ్‌ను కాల్చిన చంపిన కానిస్టేబుల్‌.. ఎందుకంటే

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. ఓ చిన్న విషయంలో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవ కారణంగా ఢిల్లీ పోలిస్ విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రాణాలు కోల్పోగా అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకకలం రేపింది.

Crime News: దారుణం.. ఫుడ్‌డెలివరీ బాయ్‌ను కాల్చిన చంపిన కానిస్టేబుల్‌.. ఎందుకంటే
Delhi Police Shooting
Anand T
|

Updated on: Apr 26, 2026 | 10:16 PM

Share

చిన్న గొడవ కారణంగా ఓ ఫుడ్‌ డెలివరీ భాయ్‌ను పోలీస్ కానిస్టేబుల్‌ కాల్చిన చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ద్వారకలోని జాఫర్‌పూర్ కలాన్ ప్రాంతంలో రూపేష్ అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీకి వచ్చిన వ్యక్తులంతా కేక్‌ కటింగ్ తర్వాత ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యారు.కొందు క్యాబ్‌ కోసం వెయిట్ చేస్తుండగా, మరికొందరు బైక్‌పై నిల్చొని మాట్లాడుతున్నారు.

ఇంతలో అదే కాలనీలో నివాసం ఉంటున్న ఢిల్లీ పోలీసు విభాగంలోని స్పెషల్ సెల్ యూనిట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీరజ్ అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ బైక్‌పై నిల్చున్న ఫుడ్‌ డెలివరీ భాయ్స్, నీరజ్‌ మధ్య చిన్నగా గొడవ ప్రారంభమైంది. కొద్ది సేపట్లోనే ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనైన నీరజ్, తన వద్ద ఉన్న తుపాకీతో బైక్‌పై ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపాడు. దీంతో బైక్‌పై కూర్చున్న ఫుడ్‌ డెలివరీ భాయ్ పాండవ్ కుమార్ అనే వ్యక్తి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అదే బుల్లెట్ అతని వెనుక కూర్చున్న కృష్ణ అనే వ్యక్తికి కూడా తగిలింది.

దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అది గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే పాండవ్ కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన కృష్ణకు చికిత్స అందించారు. ప్రస్తుతం కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నీరజ్‌ను అదుపులోకి తీసుకన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us