AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీలింగ్ ఫ్యాన్ Vs టేబుల్ ఫ్యాన్.. ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది..?

Ceiling Fan vs Table Fan: వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి మనం చేసే మొదటి పని ఫ్యాన్ వేసుకోవడం. అయితే కరెంట్ బిల్లులు చుక్కలు చూపిస్తున్న తరుణంలో.. ఏ ఫ్యాన్ వాడాలనేది ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారింది. సీలింగ్ ఫ్యాన్ గది మొత్తాన్ని చల్లబరుస్తుందా? లేక టేబుల్ ఫ్యాన్ వాడితే కరెంట్ బిల్లు ఆదా అవుతుందా? మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ ఫ్యాన్ ఎంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సీలింగ్ ఫ్యాన్ Vs టేబుల్ ఫ్యాన్.. ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది..?
Ceiling Fan Vs Table Fan
Krishna S
|

Updated on: Apr 25, 2026 | 9:22 PM

Share

భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి ఆప్షన్ ఫ్యాన్. అయితే, నెలాఖరులో వచ్చే కరెంట్ బిల్లును చూసి చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. అంతేకాకుండా మార్కెట్లో ఉన్న అనేక రకాల ఫ్యాన్లలో సీలింగ్ ఫ్యాన్ కొనాలా? లేక టేబుల్ ఫ్యాన్ తీసుకోవాలా..? అనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా కరెంట్ బిల్లు భయం ఉన్నవారికి ఈ ఎంపిక మరింత ముఖ్యం. మరి ఈ రెండింటిలో ఏది తక్కువ కరెంట్ వాడుతుంది? ఏది ఎక్కువ గాలిని ఇస్తుంది? అనే విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

విద్యుత్ వినియోగం: ఏది ఆదా చేస్తుంది?

కరెంట్ బిల్లు విషయంలో టేబుల్ ఫ్యాన్ స్పష్టమైన విజేతగా నిలుస్తుంది. సీలింగ్ ఫ్యాన్ సాధారణంగా 60 నుండి 80 వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయి. కానీ టేబుల్ ఫ్యాన్ కేవలం 30 నుండి 50 వాట్ల పరిధిలో మాత్రమే విద్యుత్‌ను వాడుకుంటాయి. మీరు రోజంతా ఫ్యాన్ వాడే వారైతే, టేబుల్ ఫ్యాన్ వాడటం వల్ల మీ విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.

గది మొత్తానికి ఏది మేలు?

గాలి ప్రసరణ విషయానికి వస్తే సీలింగ్ ఫ్యాన్ మెరుగ్గా పనిచేస్తుంది. సీలింగ్ ఫ్యాన్ గది అంతటా గాలిని సమానంగా పంచగలదు. మీరు గదిలో ఎక్కడ కూర్చున్నా చల్లని గాలి అందుతుంది. టేబుల్ ఫ్యాన్ గాలిని ఒకే దిశలో ప్రసరింపజేస్తుంది. మీరు పనిచేసే డెస్క్ లేదా పడుకునే బెడ్ దగ్గర మాత్రమే గాలి కావాలనుకుంటే టేబుల్ ఫ్యాన్ సరిపోతుంది.

సౌకర్యం – ఫ్లెక్సిబిలిటీ

టేబుల్ ఫ్యాన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనిని ఎక్కడికైనా సులభంగా మోసుకెళ్లవచ్చు. వంటగది, బాల్కనీ లేదా స్టడీ రూమ్.. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. కానీ సీలింగ్ ఫ్యాన్ ఒకసారి అమర్చిన తర్వాత శాశ్వతంగా అక్కడే ఉంటుంది. దీనికి ప్లేస్ ఆదా అవుతుంది కానీ ఇతర ప్రాంతాలకు మార్చడం సాధ్యం కాదు.

ధర – నిర్వహణ

టేబుల్ ఫ్యాన్లు తక్కువ ధరలో లభిస్తాయి, వీటికి ఎలాంటి ఇన్‌స్టాలేషన్ చార్జీలు ఉండవు. సీలింగ్ ఫ్యాన్లు కొంచెం ఖరీదైనవి. వీటిని బిగించడానికి టెక్నీషియన్ అవసరం ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్లు ఎత్తులో ఉండటం వల్ల వాటిని శుభ్రం చేయడం కష్టంతో కూడుకున్న పని. టేబుల్ ఫ్యాన్లను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

మీ ఎంపిక ఏది కావాలి..?

మీకు పెద్ద గది ఉండి, కుటుంబ సభ్యులందరికీ గాలి కావాలనుకుంటే సీలింగ్ ఫ్యాన్ తీసుకోండి. ఒకవేళ మీరు విద్యుత్‌ను ఆదా చేయాలనుకుంటే, చిన్న ప్రదేశంలో లేదా ఒక్కరే ఉండేవారైతే టేబుల్ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే