AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPhone Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఐఫోన్స్‌పై అదిరే డిస్కౌంట్స్.. తగ్గింపు ఎంతంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయంటే వాటి వినియోగం ఏ స్థాయిలో ఉందో? మనం అర్థం చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలా మందికి కలల ఫోన్‌గా ఐఫోన్ ఉంటుంది. యాపిల్ కంపెనీకు చెందిన ఐఫోన్ యువతను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే ప్రస్తుతం ఐఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ అందుబాటులో ఉంది.

IPhone Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఐఫోన్స్‌పై అదిరే డిస్కౌంట్స్.. తగ్గింపు ఎంతంటే..?
Iphone
Nikhil
|

Updated on: Jul 31, 2024 | 5:00 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయంటే వాటి వినియోగం ఏ స్థాయిలో ఉందో? మనం అర్థం చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలా మందికి కలల ఫోన్‌గా ఐఫోన్ ఉంటుంది. యాపిల్ కంపెనీకు చెందిన ఐఫోన్ యువతను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే ప్రస్తుతం ఐఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఐఫోన్ 15, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ డేస్ సేల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఈ సేల్‌లో ఐఫోన్ 15 రూ. 68,999 నుంచి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు రిటైల్ ధర రూ. 79,900గా ఉంటే ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.10,901 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 2,500 తగ్గింపు ఉంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ రూ.74,999 వద్దకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. రూ. 89,900గా ఉండగా రూ. 14,901 తగ్గింపును అందిస్తున్నారు. 

ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 14 ప్లస్ రూ.56,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,999గా ఉంది. సాధారణంగా ఐ ఫోన్ ప్రో వెర్షన్ల ధరలు రూ.లక్షకు దగ్గరగా ఉంటాయి. అయితే ఈ సేల్‌లో ఆ ధరలు బాగా తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 ప్రో మోడల్ రూ. 1,24,990కే అందిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ. 1,34,990గా ఉంది. అంతే కాకుండా పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసే వారికి ప్రత్యేక ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో ఐఫోన్ 13 రూ. 52,999 అందుబాటులో ఉండగా ఐఫోన్ 12 రూ.39,999కే మీ సొంతం అవుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి