Whatsapp Update: ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్.. ఇక స్టేటస్ ప్రియులకు పండగే..!

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త అప్‌డేట్స్‌ను ఇస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా యూజర్లు వారి ఫ్రెండ్స్ పెట్టిన వాట్సాప్ స్టేటస్‌లను కూడా నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ షేర్ చేసుకునే ఫీచర్‌ను అభివృద్ధి చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది.

Whatsapp Update: ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్.. ఇక స్టేటస్ ప్రియులకు పండగే..!
New Feature In Whatsapp
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 28, 2024 | 8:43 AM

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన స్మార్ట్ వినియోగంతో వాట్సాప్‌ను వినియోగించే వారి సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అంతలా వాట్సాప్ అందరి దృష్టిని ఆకర్షించింది. పెరిగిన వాడకాన్ని మెరుగుపర్చుకునేందుకు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త అప్‌డేట్స్‌ను ఇస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా యూజర్లు వారి ఫ్రెండ్స్ పెట్టిన వాట్సాప్ స్టేటస్‌లను కూడా నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ షేర్ చేసుకునే ఫీచర్‌ను అభివృద్ధి చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివ‌ృద్ధి దశలో ఉంది. భవిష్యత్‌లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ తాజా ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రిషేర్ స్టేటస్ అప్‌డేట్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్, వినియోగదారులు ట్యాగ్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లను షేర్ చేసే ప్రక్రియను సులభతరం చేయనుంది. మీ ఫ్రెండ్స్ పెట్టే వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ మిమ్మల్ని ట్యాగ్ చేస్తే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆ స్టేటస్‌ను మీరు తిరిగి రీషేర్ చేయవచ్చు. ప్రస్తుతానికి బీటా టెస్టర్‌లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో లేదు.  వాట్సాప్ భవిష్యత్ అప్‌డేట్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. స్టేటస్ అప్‌డేట్ ఇంటర్‌ఫేస్‌లో కొత్త బటన్‌ను కనిపిస్తుందని, ఈ బటన్ ద్వారా వారు పేర్కొన్న స్టేటస్ అప్‌డేట్ సులభంగా రీ షేర్ చేయవచ్చు. ముఖ్యంగా స్క్రీన్‌షాట్‌లను తీయడం లేదా మీడియాను ప్రైవేట్‌గా పంపమని ఫ్రెండ్స్‌ను అడిగే అవసరం లేకుండా ఈ ఫీచర్ ద్వారా సింపుల్‌గా స్టేటస్‌ను రీషేర్ చేయవచ్చు. 

స్టేటస్ రీషేర్ ఫీచర్ ద్వారా కంటెంట్ షేరింగ్‌ను సరళీకృతం అవ్వడమే కాకుండా యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. స్టేటస్ అప్‌డేట్ ఇంటర్‌ఫేస్ ద్వారా నేరుగా స్టేటస్ రీషేర్ చేయవచ్చు. అలాగే ఈ ఫీచర్ గురించి తాజా అప్‌డేట్‌ల కోసం ఎక్స్ వాట్సాప్ బీటా ఇన్‌‌ఫో పేజీను ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్ షేరింగ్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉన్నప్పటికీ ఈ ఫీచర్ గురించి టెక్ నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డికి నోటీసులు
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డికి నోటీసులు
యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?
శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?
టాలీవుడ్‏లోకి సప్త సాగరాలు దాటి హీరోయిన్..
టాలీవుడ్‏లోకి సప్త సాగరాలు దాటి హీరోయిన్..
ఏఐ ఫీచర్‌తో రెండు నయా ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసిన హెచ్‌పీ..!
ఏఐ ఫీచర్‌తో రెండు నయా ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసిన హెచ్‌పీ..!
అసిడిటితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు..
అసిడిటితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు..
మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే