Google Pixel 9 Pro Fold: గూగుల్ ఫోల్డ్ ఫోన్‌ లాంచ్ డేట్ ఫిక్స్.. అంతకుముందే లీకైన కీలక వివరాలు..

అధికారిక టీజర్ల ప్రకారం 2024, ఆగస్టు 13వ తేదీన గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇది హైయర్ ఎండ్ స్మార్ట్ ఫోన్. జెమినీ ఏఐతో ఇంటిగ్రేట్ అయి వర్క్ చేస్తుంది. గూగుల్ నుంచి వస్తున్న రెండో ఫోల్డబుల్ ఫోన్ ఇది. కాగా మన దేశంలో లాంచ్ కానున్న మొదటి గూగుల్ ఫోల్డబుల్ ఫోన్. అయితే గూగుల్ ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా విడుదల చేయలేదు.

Google Pixel 9 Pro Fold: గూగుల్ ఫోల్డ్ ఫోన్‌ లాంచ్ డేట్ ఫిక్స్.. అంతకుముందే లీకైన కీలక వివరాలు..
Google Pixel 9 Pro Fold
Follow us

|

Updated on: Jul 25, 2024 | 4:23 PM

మన దేశ మార్కెట్లో కూడా గూగుల్ పిక్సల్ ఫోన్లకు మంచి డిమాండే ఉంది. కాస్త ధర ఎక్కువైనా బ్రాండ్ ఇమేజ్, దానిలోని ఫీచర్లు జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. ఈ క్రమంలో గూగుల్ పిక్సల్ 9 సిరీస్ లో మరో వేరియంట్ ను లాంచ్ చేసేందుకు కంపెనీ డేట్ ఫిక్స్ చేసింది. అధికారిక టీజర్ల ప్రకారం 2024, ఆగస్టు 13వ తేదీన గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇది హైయర్ ఎండ్ స్మార్ట్ ఫోన్. జెమినీ ఏఐతో ఇంటిగ్రేట్ అయి వర్క్ చేస్తుంది. గూగుల్ నుంచి వస్తున్న రెండో ఫోల్డబుల్ ఫోన్ ఇది. కాగా మన దేశంలో లాంచ్ కానున్న మొదటి గూగుల్ ఫోల్డబుల్ ఫోన్. అయితే గూగుల్ ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా విడుదల చేయలేదు. కొన్ని రూమర్స్, లీకులు మాత్రం ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ అంతకుముందు ఉన్న ఫోల్డబుల్ ఫోన్ కి పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఆన్ లైన్ లీకైన డిస్ ప్లే, కెమెరా, స్పెక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ డిస్ ప్లే..

ఆన్ లైన్లో లీకైన సమాచారం ప్రకారం.. రాబోయే స్మార్ట్‌ఫోన్ దాని మునుపటి కంటే చాలా పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 8-అంగుళాల డిస్ ప్లే ఉంటుందని చెబుతున్నారు. ఫోల్డ్ 1 ఫోన్లో 7.4-అంగుళాల డిస్ ప్లే ఉండగా.. కొత్త ఫోన్ అప్‌గ్రేడ్ అయ్యింది. కొత్త డిస్‌ప్లే స్పష్టంగా 2152 x 2076 రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 1,600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.

కెమెరా వివరాలు..

టీజర్ లోపలి స్క్రీన్‌పై కెమెరాను బహిర్గతం చేయనప్పటికీ, ఫోన్ స్క్రీన్‌కు ఎడమ వైపున పంచ్-హోల్ కెమెరాను కలిగి ఉంటుందని లీకైన వివరాలు సూచిస్తున్నాయి. మొదటి ఫోల్డ్ లో ఉన్న పంచ్-మౌంటెడ్ కెమెరాను అప్ గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పంచ్ పరిమాణం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.

గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ అంచనా ధర..

ఈ గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ ధర 256జీబీ వెర్షన్ ధర సుమారు రూ. 184,000 ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ను కూడా గూగుల్ ఫిక్స్ చేసింది. ఆగస్టు 13వ తేదీన గ్రాండ్ గా దీనిని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!