నింగిలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫోటో.. ఆదివారం ఉదయం దూసుకుపోనున్న పీఎస్‌ఎల్వీ సీ -51

నింగిలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫోటో..ఎస్‌..మీరు వింటున్నది నిజమే. ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ సీ-51 ద్వారా..భగవద్గీతతో పాటు..ప్రధాని మోదీ ఫొటోను నింగిలోకి పంపుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో.

  • Sanjay Kasula
  • Publish Date - 12:05 am, Sun, 28 February 21
నింగిలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫోటో.. ఆదివారం ఉదయం దూసుకుపోనున్న పీఎస్‌ఎల్వీ సీ -51
PSLV-C51

PSLV-C51: నింగిలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫోటో..ఎస్‌..మీరు వింటున్నది నిజమే. రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ సీ-51 ద్వారా..భగవద్గీతతో పాటు..ప్రధాని మోదీ ఫొటోను నింగోలోకి పంపుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో.

మరో ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. రేపు ఉదయం 10గంటల 24 నిమిషాలకు.. నెల్లూరు జిల్లాలోని షార్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్వీ సీ 51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. 50 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా విదేశీ ప్రైవేట్‌ సంస్థల ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపనుంది ఇస్రో. బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1తో పాటు మరో 18 నానో ఉపగ్రహాలను సైతం మోసుకెళ్లనుంది.

ఈ పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్‌ ద్వారా.. ఓ ఈ అరుదైన ఘట్టానికి తెరలేపింది చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్స్‌ అనే ఇండియా సంస్థ. మొట్టమొదటిసారిగా తాము చేస్తున్న ఈ ప్రయోగంలో ..ప్రధాని మోదీ ఫొటో కింద..ఆత్మనిర్భర్‌ మిషన్‌ అనే పదాలతో పాటు భగవద్గీతను పంపే ఏర్పాట్లుచేశారు. అంతేకాదు. మరో 25వేల మంది పేర్లను కూడా పంపేందుకు ప్లాన్‌ చేశారు. ఆ 25వేల మందిలో వెయ్యి మంది విదేశీయులు కాగా..చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లున్నాయి.

ఇస్రో పరిశోధనల్లో తాము కూడా భాగస్వాములవడం సంతోషంగా ఉందన్నారు స్పేస్‌ కిడ్జ్‌ సీఈవో కేశన్‌. ఇస్రో, ప్రధాని సహకారంతో..సీ-51ద్వారా శాటిలైట్‌ను పంపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందుకే ప్రధానికి కృతజ్ఞతగా..ఆయన ఫొటో నింగిలోకి పంపుతున్నామని..ఇది ప్రధానికి తామిచ్చే గౌరవంగా భావిస్తున్నామన్నారు. మరోవైపు పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతమవ్వాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించారు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌. స్వామివారిని దర్శించుకున్న శివన్‌..రాకెట్‌ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో..తొలి ప్రయోగానికి ఇస్రో రంగం సిద్ధం చేసిందని..పీఎస్‌ఎల్వీ సీ-51తో ప్రైవేట్‌ పరంగా తొలి అడుగు పడనుందని తెలిపారు శివన్‌. పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్‌ ప్రయోగాన్ని సక్సెస్‌ చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరో మైలురాయిని దాటనుంది ఇస్రో.

ఇవి కూడా చదవండి

Tamil Nadu: పందెం గెలిచేదెవరు…? ప్రతిపక్షంలో కూర్చొనేది ఎవరు… ? తమిళ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్..
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి అన్ని ఆర్జిత సేవలు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..