Air Condition: ఏయే ఏసీలకు ఎంత విద్యుత్‌ ఖర్చు అవుతుందో తెలుసా? కరెంట్‌ బిల్లు తగ్గించుకునే మార్గాలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఉదయం నుంచే ఎండ దంచి కొడుతుంది. జనాలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండకాలంలో ప్రతి ఇంట్లో ఏసీలు కూలర్లతో సేదతీరుతుంటారు. అయితే సామాన్యులు సైతం ఇంట్లో ఏసీని ఏర్పాటు చేసుకుంటున్నారు..

Air Condition: ఏయే ఏసీలకు ఎంత విద్యుత్‌ ఖర్చు అవుతుందో తెలుసా? కరెంట్‌ బిల్లు తగ్గించుకునే మార్గాలు
Air Condition
Follow us

|

Updated on: Apr 23, 2024 | 2:34 PM

రాష్ట్రంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఉదయం నుంచే ఎండ దంచి కొడుతుంది. జనాలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండకాలంలో ప్రతి ఇంట్లో ఏసీలు కూలర్లతో సేదతీరుతుంటారు. అయితే సామాన్యులు సైతం ఇంట్లో ఏసీని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఏసీ పెట్టుకుంటే సరిపోదు, కరెంటు ఖర్చు కూడా ఎక్కువే. 2 టన్నుల ఏసీ ఒక గంటలో ఎంత విద్యుత్ వినియోగిస్తుంది అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది.

  1. ఏసీ ఎనర్జీ ఎఫిషియెంట్ రేటింగ్ (EER): EER రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే ఏసీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటుంది.
  2. గది ఉష్ణోగ్రత: గది వేడిగా ఉన్నప్పుడు ఏసీ చల్లబరచడానికి ఒత్తిడి పెరుగుతుంది. ఆ సందర్భంలో ఎక్కువ విద్యుత్తు ఖర్చు అవుతుంది.
  3. గది పరిమాణం: ఒక చిన్న గదిని చల్లబరచడానికి ఎంత విద్యుత్తు అవసరమో, పెద్ద గదులకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుచేత ఇల్లు పెద్దదైతే కరెంటు ఎక్కువగా అవసరం ఉంటుంది.
  4. ఏసీ వాడకం: మీరు ఏసీని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది కూడా ఒక అంశం. నిరంతర వినియోగం వల్ల ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. అప్పుడప్పుడు ఆపడం వల్ల ఖర్చులు కూడా తగ్గుతాయి.
  5. భారతదేశంలో 2 టన్నుల ఏసీ సగటు విద్యుత్ వినియోగం గంటకు 1500 నుండి 2500 వాట్స్. అంటే గంటలో 1.5 నుంచి 2 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించుకోవచ్చు.

ఎంత ఖర్చు అవుతుంది?

  1. 1.5 టన్ను AC: గంటకు 1200 నుండి 1800 వాట్స్ (గంటకు 1.2 నుండి 1.8 యూనిట్ల విద్యుత్ వినియోగం).
  2. 2 టన్ను AC: గంటకు 1500 నుండి 2500 వాట్స్ (గంటకు 1.5 నుండి 2.5 యూనిట్ల విద్యుత్ వినియోగించుకుంటుంది.)
  3. 5 టన్ను AC: గంటకు 1800 నుండి 3000 వాట్స్ (గంటకు 1.8 నుండి 3 యూనిట్ల విద్యుత్ వినియోగించుకుంటుంది.)
  4. కానీ ఈ అంశాలు మీరు వాడే ఏసీపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. మీరు వినియోగించే ఏసీ వల్ల విద్యుత్‌ ఎంత ఖర్చు అవుతుందనేది మారవచ్చు.

విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలంటే..

  • అధిక EER రేటింగ్ ఉన్న ACని కొనుగోలు చేయండి.
  • గది ఉష్ణోగ్రత 24, 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచండి.
  • ఇంట్లో లేని సమయంలో ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు.
  • సూర్యుని వేడిని నివారించడానికి కర్టెన్లు, కిటికీలు మూసి ఉంచండి. ఏసీని క్రమం తప్పకుండా సర్వీసు చేయడం మంచిది. ఏసీ వాడకంలో ఇలాంటి ట్రిక్స్‌ పాటించడం వల్ల విద్యుత్‌ బిల్లును తగ్గించుకోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు