OnePlus Nord CE 3: వన్‌ప్లస్‌ ఫోన్‌పై ఏకంగా రూ. 6 వేల డిస్కౌంట్‌.. ఎలా పొందాలంటే..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌కు భారత మార్కెట్లో మంచి ఆదరణ ఉందన్న విషయం తెలిసిందే. మొదట్లో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్‌ తాజాగా మార్కెట్లోకి వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే లాంచ్‌ చేసిందే వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 స్మార్ట్ ఫోన్‌. ఈ ఫోన్‌లో వన్‌ప్లస్‌...

OnePlus Nord CE 3: వన్‌ప్లస్‌ ఫోన్‌పై ఏకంగా రూ. 6 వేల డిస్కౌంట్‌.. ఎలా పొందాలంటే..
Oneplus Nord Ce 3
Follow us

|

Updated on: Apr 23, 2024 | 1:46 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌కు భారత మార్కెట్లో మంచి ఆదరణ ఉందన్న విషయం తెలిసిందే. మొదట్లో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్‌ తాజాగా మార్కెట్లోకి వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే లాంచ్‌ చేసిందే వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 స్మార్ట్ ఫోన్‌. ఈ ఫోన్‌లో వన్‌ప్లస్‌ గతేడాది జూన్‌లో లాంచ్‌ చేసింది. అయితే ఈ ఫోన్‌ను కంపెనీ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎలాంటి డిస్కౌంట్‌ లభించనుంది.? ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీసీ3 ఫోన్‌పై గతేడాది నవంబర్‌లోనే ఓసారి డిస్కౌంట్‌ను ప్రకటించగా తాజాగా మరోసారి రూ. 2వేలు డిస్కౌంట్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 స్మార్ట్‌ ఫోన్‌ లాంచింగ్‌ సమయంలో రూ. 26,999గా ఉండేది అయితే తాజాగా ఈ ఫోన్‌ను రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌పై ప్రస్తుతం రూ. 4 వేల డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 20,990కే సొంతం చేసుకోవచ్చన్నమాట.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 782జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌ ప్రస్తుతం 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్సిజన్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్890 కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్స్‌ ఉన్నాయి. అలాగే సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?