- Telugu News Photo Gallery Technology photos These unwanted changes in your smartphone may be the reason for hacking
Smartphone: మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? హ్యాకింగ్‌కు గురైనట్లే
మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. అన్ని రకాల ఆర్థిక అవసరాలకు కేంద్రంగా మారిన స్మార్ట్ ఫోన్‌ను హ్యాక్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. అయితే స్మార్ట్ ఫోన్ హ్యాక్‌కి గురైన విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 23, 2024 | 11:47 AM

మీ స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా ఏ కారణం లేకుండా త్వరగా ఖర్చవుతోంది అంటే మీ ఫోన్ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాగ్రౌండ్‌లో ఫోన్‌ను ఆపరేట్ చేస్తుంటారు. దీంతో డేటా వేగంగా ఖర్చవుతుంది

ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న సమయంలో అదే పనిగా ఏదో ఒక పాపప్‌లు వస్తుంటే కూడా వెంటనే అలర్ట్ కావాలి. ఇది కూడా మీ ఫోన్ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయాల్లో వచ్చే ఎలాంటి పాపప్‌లను కూడా ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇక మీ ప్రమేయం లేకుండా స్మార్ట్ ఫోన్‌లో కొత్త యాప్స్ ఏవైనా డౌన్‌లోడ్ అయితే మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఇక ఫోన్‌ను ఉపయోగించకపోయినా వేడెక్కుతుంటే కూడా ఫోన్ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. హ్యాకింగ్‌కి గురైన ఫోన్ బ్యాగ్రౌండ్‌లో రన్ అవుతుంది. కాబట్టి మీకు తెలియకుండానే వేడిగా మారుతుంది.

అలాగే కొన్ని అదే పనిగా తెలియని మెసేజ్‌ల నుంచి స్పామ్ కాల్స్ వస్తున్నా, మెసేజ్‌లు వస్తున్నా వెంటనే అలర్ట్ అవ్వాలి. అలాగే.. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే కూడా హ్యాక్ అయినట్లు భావించాలి.





























