Gram Flour Test: శనగ పిండి నిజమైనదా..? నకిలీదా..? గుర్తించడం ఎలా..? ఇలా చేయండి
శనగ పిండిని పప్పు సహాయంతో తయారుచేస్తారు. దాని సహాయంతో మనం పకోడిలతో పాటు ఇతర పండి పదార్థాలు కూడా తయారు చేసుకుంటాము. ముఖ్యంగా వర్షాకాలంలో..
శనగ పిండిని పప్పు సహాయంతో తయారుచేస్తారు. దాని సహాయంతో మనం పకోడిలతో పాటు ఇతర పండి పదార్థాలు కూడా తయారు చేసుకుంటాము. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రతి సీజన్‌లో ఈ చిరుతిండిని తినడానికి ఇష్టపడుతుంటాము. శనగపిండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో గమనించండి. ఈ రోజుల్లో కల్తీ మార్కెట్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ రోజు మనం మీకు అలాంటి సులభమైన ఉపాయాలను చెప్పబోతున్నాము. దీని సహాయంతో నిజమైన, నకిలీ పిండిని సులభంగా గుర్తించవచ్చు.
నగపిండి ఎందుకు కల్తీ అవుతుంది?
ఏదైనా ఆహార పదార్ధంలో కల్తీ చేయడం అసలు ఉద్దేశ్యం గరిష్ట లాభం పొందడమే. కానీ అలాంటి వ్యాపారులు కస్టమర్ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో ఆలోచించరు. కొందరు అందులో మొక్కజొన్న పిండిని కలుపుతారు. కొందరు గోధుమ పిండిని కలుపుతారు.
View this post on Instagram
నిజమైన, నకిలీ పిండిని ఎలా గుర్తించాలి?
1. హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో పరీక్షించండి:
కళ్లను చూసి శనగపిండి నాణ్యతను గుర్తించడం అసాధ్యం. ఈ రోజుల్లో ప్యాక్ చేసిన, వదులుగా ఉన్న శెనగపిండి రెండూ భారీగా కల్తీ చేస్తున్నారు. దానిని గుర్తించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉపయోగిస్తారు. మీరు ఒక గిన్నెలో 2 నుంచి 3 చెంచాల శనగపిండిని తీసుకుని, నీటిని జోడించి పేస్ట్‌ను సిద్ధం చేయండి. దానికి 2 టీస్పూన్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి కొన్ని నిమిషాలు వేచి ఉండండి. శనగపిండి రంగు ఎర్రగా మారితే అది కల్తీ అని అర్థం.
2. నిమ్మకాయతో..
నిమ్మకాయ దాదాపు ప్రతి ఇంటిలో ఉంటుంది. దాని సహాయంతో మీరు నిజమైన, నకిలీని సులభంగా గుర్తించవచ్చు. మీరు కేవలం ఒక చిన్న ప్రయోగం చేయాలి. దీని కోసం ఒక పాత్రలో 3 చెంచాల శనగపిండిని తీసుకుని, అదే చెంచా నిమ్మరసం కలపండి. ఇప్పుడు దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపండి. దాదాపు 5 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత శనగపిండి రంగు గోధుమరంగు లేదా ఎరుపు రంగులోకి మారితే అందులో కల్తీ జరిగిందని అర్థం చేసుకోండి. ఇలా శనగ పిండి కల్తీ జరిగిందో లేదా తెలుసుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి